Liger : పూరీజగన్నాథ్ తన రేంజ్ హిట్టు కొట్టి చాలా రోజులైంది. ఈసారి లైగర్ తో ఆ కోరిక తీర్చుకుందాం అనుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో హిట్, సూపర్ హిట్ కొట్టాలనుకుంటే ఆ కోరిక తీరనట్టే కనిపిస్తోంది. ఇక విజయ్ పరిస్థితి పాపం. వరల్డ్ ఫేమస్ లవర్, డిజాస్టర్ తరువాత ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అలాగే ఆశలు పెట్టుకున్నాడు. కానీ సినిమా మాత్రం అందరికీ నిరాశే మిగిల్చింది. ఇంతకీ సినిమా మీద టాక్ ఎలా ఉందంటే…

ఓకే..ఓకే.. అమ్మ నాన్న తమిళ అమ్మాయి గుర్తొచ్చింది…
సినిమాలో కిక్ బాక్సర్ గా నత్తి ఉన్న వ్యక్తి గా విజయ్ నటన బాగుంది. ఇక తల్లిగా రమ్యకృష్ణ నటన సూపర్. అయితే బాహుబలి చూసిన కళ్ళతో చూస్తే సంతృప్తి చెందరు. ఇక హీరోయిన్ పరిస్థితి పాపం సినిమాలో కేవలం పాటలకోసం ఉందేమో అనిపిస్తుంది. పెద్దగా సినిమాలో తన క్యారెక్టర్ లేదు మొత్తం సోలో గా విజయ్ పెరఫార్మెన్స్ తో సినిమాను లేపాడు. ఇక రోనిత్ రాయ్ కోచ్ గా బాగా నటించాడు. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే సినిమా నడుస్తుంది. అతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ల్యాగ్ ఎక్కువైంది. ఇక మైక్ టైసన్ ఎపిసోడ్ ఓకే. మ్యూజిక్, బిజీఎం అంతగా ఆకట్టుకోలేదనిపిస్తుంది. సినిమా పూరీ ఫ్యాన్స్ కి విజయ్ ఫ్యాన్స్ కి అంతగా కాకపోయినా కొంత వరకు నచ్చవచ్చు. కానీ కామన్ ఆడియన్స్ పూరీ మీద ఎక్సపెక్టషన్స్ తో పోతే మాత్రం నిరాశ తప్పదు. ఫస్ట్ హాఫ్ ఓకే సెకండ్ హాఫ్ పర్వాలేదు… ఇపుడు సోషల్ మీడియాలో అదే మాట వినిపిస్తోంది.

అసలు పూరీకి ఏమైంది. ఒక బద్రి, ఇడియట్, పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి సినిమాలు తీసిన పూరీనేనా ఈ సినిమా తీసింది. రాజమౌళి కన్నా తోపు అయ్యా నువ్బు ఏంటి ఆ స్క్రీన్ ప్లే అంటూ ట్రోల్స్ వినిపిస్తున్నాయి. కామన్ గానే పూరీ సినిమాల్లో హీరోయిన్ కి మంచి క్యారెక్టర్ డిజైన్ చేస్తారు పూరీ అలాంటిది అసలు ఈ సినిమాలో అనన్య పాండే కి పెద్దగా ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదో, ఆ స్క్రీన్ ప్లే ఏంటి అనిపిస్తుంది. లైగర్ రూపంలో వచ్చిన మంచి అవకాశాన్ని పూరీ, విజయ్ కోల్పోయారేమో అనిపిస్తుంది. ఇక దీనికి తోడు సెన్సర్ కత్తిరింపులో ఒక ఏడు సన్నివేశాలు వెళ్లిపోయాయి. ఇపుడు బయటవినిపిస్తున్న టాక్ అందులో కొన్ని సన్నివేశాలు ఇంటర్వెల్ ముందు పడుంటే సినిమా లెవెల్ వేరేగా ఉండేది అంటూ పాపం అంటున్నారు. కానీ పూరీ, విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్ మాత్రం సినిమాను బాగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా ఫలితం కోసం ఇంకా వెయిట్ చేయాలి.



























