Liger : రౌడీ బాయ్ గా ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఎంతగానో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. లైగర్ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తోంది. మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ట్రైలర్ ను లాంచ్ చేసారు.

లైవ్ లో ముద్దడిగిన అనన్య…
ఇక ప్రమోషన్స్ ను పీక్స్ లో చేస్తున్న పూరీజగన్నాథ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హడావిడి చేసారు. అంతకుముందు విడుదల చేసిన టీజర్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక తోలుత హిందీ లైగర్ ట్రైలర్ ను ముంబై లో విడుదల చేయగా ఈవెంట్ కి బాలీవుడ్ హీరో రన్ వీర్ సింగ్ హాజరై సందడి చేసారు. ఇక ఈ ఈవెంట్లో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా హాజరై సందడి చేసారు.

ట్రైలర్ లాంచ్ లో అనన్య విజయ్ లు ఆకడి పకడీ సాంగ్స్ కి డాన్స్ చేసారు. ఆ సమయంలో అనన్య విజయ్ ని ముద్దడుగగా పెట్టాడు. ఆ తరువాత రన్ వీర్ ను అడుగగా పక్కకు వెళ్ళిపోయాడు. ఇక కరణ్ జోహార్ కాసేపు రన్ వీర్ కు మేక్ అప్ మెన్ గా చేసి నవ్వించాడు. ఇక తెలుగు ట్రైలర్ లాంచ్ హైదరాబాద్ లోని సుదర్శన థియేటర్ లో అభిమానుల సమక్షంలో జరిగింది. ఇక ఈ ముద్దు గోల వీడియో మాత్రం నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.

































