Lirisha Kunapareddy : ‘వకీల్ సాబ్’ సినిమాలో సూపర్ ఉమెన్ గా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నటి లిరీష. లిరీష అంటే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు కానీ సూపర్ వుమన్ సరళదేవి అంటే టక్కున గుర్తు పడతారు. వకీల్ సాబ్ సినిమాలో కోర్ట్ సీన్ లో సూపర్ కాప్ గా కనిపించిన లిరీష చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా వకీల్ సాబ్ సినిమా తరువాత మంచి గుర్తింపు అవకాశాలను అందుకుంటోంది. సీరియల్స్ లోనూ పనిచేసింది. ప్రస్తుతం కలసి ఉంటే కలదు సుఖం సీరియల్ లో నటిస్తున్న లిరీష ఇండస్ట్రీలో అవకాశాలను, సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సమస్యలను గురించి ఇటీవల యూట్యూబ్ లో ఇంటర్వ్యూలో పంచుకుంది.

కావాలనే నన్ను మోహన్ బాబు తోసేశారు…
సినిమాల్లో అవకాశాలు అంత ఈజీగా రావు. ఇక వచ్చినా వాటిని నిలబెట్టుకోవాలి. అందుకోసం కష్టపడాల్సిందే. లిరీష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినపుడే సీరియల్స్ వైపు అడుగులేసింది. అలా సీరియల్స్ చేస్తూ మరో వైపు సినిమాలలో ప్రయత్నించగా ఒక చిన్న సినిమాలో ఆలీ గారు పరిచయమై ఆయన మోహన్ బాబు గారి పొలిటికల్ రౌడీ సినిమాకు అవకాశం ఇప్పించారట. అలా మోహన్ బాబు గారి సినిమాలో హీరోయిన్ ఛార్మి ఫ్రెండ్ గా నటించిన లిరీష కొత్త కావడంతో ఎక్స్ప్రెషన్స్ కోసం కష్టపడేదట.

ఇక ఒక సీన్ లో ప్రకాష్ రాజు గారి ముందు కిందకి పడాల్సి ఉండగా సెల్ఫ్ గా పడలేక ఇబ్బంది పడుతుంటే మోహన్ బాబు గారు వెనక నుండి వచ్చి తోసేశారట. సీన్ ఓకే అయ్యాక ఇలా చేయాలి నటన అని చెప్పారట. ఆ సినిమాలో మోహన్ బాబు గారితో కలిసి పనిచేయడం వల్ల క్రమశిక్షణ అలాగే ఎలా నటించాలి అనే విషయాలను నేర్చుకున్నానని లిరీష చెప్పారు.



























