Lirisha Kunapareddy వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ గా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నటి లిరీష. లిరీష అంటే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు కానీ సూపర్ వుమన్ సరలా దేవి అంటే టక్కున గుర్తు పడతారు. వకీల్ సాబ్ సినిమాలో కోర్ట్ సీన్ లో సూపర్ కాప్ గా కనిపించిన లిరీష చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా వకీల్ సాబ్ సినిమా తరువాత మంచి గుర్తింపు అవకాశాలను అందుకుంటోంది. సీరియల్స్ లోను పనిచేసింది. ప్రస్తుతం కలసి ఉంటే కలదు సుఖం సీరియల్ లో నటిస్తున్న లిరీష ఇండస్ట్రీలో అవకాశాలను, సినిమా ఇండస్ట్రీలో తన అనుభవాలను, గురించి ఇటీవల యూట్యూబ్ లో ఇంటర్వ్యూలో పంచుకుంది.

బ్రహ్మానందం ఇప్పటికీ అలానే అంటారు… వేణు మాధవ్ విషయంలో వెళ్ళాకపోడానికి కారణం…
బ్రహ్మానందం గారు, అలీ గారితో ఎక్కువ సినిమాలను చేయడం వల్ల మంచి అనుబంధం ఉందని తెలిపారు లిరీష. బ్రహ్మానందం గారితో ఒక సినిమా చేసే సమయంలో గర్భవతిగా ఉండటం వల్ల ఆయన అమ్మాయిని కను అబ్బాయి వద్దు అని చెప్పేవారు. పాప పుట్టాక కూడా కాల్ చేసి ఆడపిల్ల పుట్టిందని చెబితే సంతోషం అమ్మాయిలే బాగా చూసుకుంటారు అంటూ చెప్పారు. ఇప్పటికీ ఎపుడైనా ఫోన్ చేస్తే పాప గురించి అడుగుతారు.

జాగ్రత్తగా చూసుకో అంటూ చెబుతారు అని లిరీష పంచుకున్నారు. ఇక వేణు మాధవ్ గారితో కూడా సినిమాల్లో కాంబినేషన్ పనిచేసానని చెప్పారు లిరీష. అయితే తనకి పెద్దగా ఆయనతో పరిచయం లేదని ఆయన హెల్త్ బాగోలేక ఉన్నపుడు వేరే వాళ్లందరితో కలిసి వెళ్లి చూసాను కానీ ఒక్కదానిని ఎపుడూ వెళ్లి కలవలేదు. మా మధ్య అంత చనువు లేదు సెట్స్ లో పలకరించే దాన్ని అంతే అంటూ చెప్పారు లిరీష.































