Looks Rajashekhar : డాన్స్ షోల ద్వారా ఎంతో మంది కోరియోగ్రాఫర్లు ప్రస్తుతం సినిమాల్లోకి వస్తున్నారు. అయితే ఒకప్పుడు డాన్స్ షోస్ వేరు ఇప్పుడు డాన్స్ షోస్ వేరు అన్నట్లుగా అనిపిస్తుంది. ఒకప్పుడు డాన్స్ షోలకు ఉండే క్రేజ్ వేరు అందులోనూ ఢీ, ఆట, డాన్స్ బేబీ డాన్స్ వంటి డాన్స్ షోలకు మంచి క్రేజ్ ఉండేది. అయితే ఆట షో ఓంకార్ యాంకర్ వచ్చి అందులో డాన్స్ కంటే కాంట్రావెర్సీ ఎక్కువగా ఉండేది. అలాంటి ఆట లో విన్నర్ గా నిలిచిన లుక్స్ రాజశేఖర్ ఆ షో తరువాత ఎక్కడా కనిపించలేదు. అయితే చాలా ఏళ్ల తరువాత మళ్ళీ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించిన లుక్స్ రాజశేఖర్ తన లైఫ్ అండ్ కెరీర్ గురించి పలు విషయాలను పంచుకున్నారు.

కోరియోగ్రాఫర్ కష్టాలు… కాంట్రావెర్సీ ఉంటేనే చూస్తారు…
ఆట సీజన్ లో విన్నర్ గా గెలిచిన లుక్స్ రాజశేఖర్ గారు ప్రతి ఎపిసోడ్ లో కొత్త కాన్సెప్ట్ తో డాన్స్ చేసేవారు. అయితే షోలో ప్రతిసారి గొడవలు వచ్చేవన్నీ నిజంగా జరిగేవేనా లేక హైప్ కోసం క్రియేట్ చేసేవా అనే విషయం అడిగినపుడు నిజంగానే జరిగినవే కానీ క్రియేట్ చేసేవి కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఒక్కో కంటెస్టెంట్ చాలా కష్టపడి చేసినపుడు ఏదైనా హర్ట్ అయ్యేలా మాట్లాడినపుడు గొడవ జరుగుతుంది అది టీవీ లో రేటింగ్స్ కోసం ఎక్కువగా వేస్తుంటారు అంటూ చెప్పారు.

ఇక డాన్స్ షోలో అవకాశం రావడమే ఎక్కువ అనుకునే రోజుల్లో పేమెంట్స్ ఎక్కువగా ఆలోచించం అందుకే డబ్బు అక్కడ మ్యాటర్ అయ్యేది కాదు కానీ ఆ షో తరువాత సినిమా ఆఫర్స్ వస్తాయని అనుకున్నా కోరియోగ్రఫీ చేయాలంటే కార్డు ఉండాలని తెలియదు. అయితే ఆ సమయంలో ఒక కార్డు తీసుకోవాలన్నా లక్షల్లో డబ్బు పెట్టాలి అంత స్థోమత అప్పుడు లేకపోవడం వల్ల కుదరలేదు అంటూ తెలిపారు. ఇక తాను ఆర్థికంగా ఇప్పుడు బాగున్నందున మళ్ళీ తాను సినిమాలకు పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కొరియోగ్రాఫర్ అవడం తన కల అని అది ఇన్నేళ్లు చేయలేకపోయినందుకు ఎమోషనల్ అయ్యారు.
































