Manchu Vishnu: టాలీవుడ్ సమస్యలు ఒక్కక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. ఇటీవల చిరంజీవితో సహా మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, నారాయణ మూర్తి, కొరటాల శివ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టికెట్ రేట్లకు తెర పడినట్లుగా అందరు ప్రకటించారు.
గత రెండు నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభన తీరిందని వెల్లడించారు. ఏపీలో టాలీవుడ్ పరిశ్రమని డెవలప్ చేయాలని సీఎం జగన్ అన్నారని వెల్లడించారు. అయితే ఈ సమావేశానికి సీనియర్ నటుడు మోహన్ బాబుని పిలిచారా..? అసలు ఆయనే కావాలని వెళ్లలేదా ..? అనే డౌట్లు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే నిన్న మంత్రి పేర్ని నాని మోహన్ బాబుతో భేటీ అయ్యారు. అంతా కూడా మొన్న సినీ ప్రముఖులతో జరిగిన సమావేశం గురించి చర్చించినట్లు.. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారని అనుకున్నారు.
దీనికి సంబంధించి మంచు విష్ణు కూడా ఓ ట్విట్ వదిలాడు. మా ఇంటికి మంత్రి పేర్ని నాని రావడం ఆనందంగా ఉందని.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ మెంట్ ప్లాన్స్ వివరించారని.. అందుకు థాంక్స్ అంటూ ట్విట్ చేశాడు. అయితే ఈ ట్విట్ పై మంచు విష్ణు అడ్డంగా బుక్కయ్యాడు. మంచు విష్ణు ట్విట్ తన ద్రుష్టికి వచ్చిందని.. కాగా తాను మర్యాదపూర్వకంగా మోహన్ బాబును కలిసేందుకే వెళ్లానని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వ్యక్తిగతంగా ఏ ఒక్కరికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ట్విట్ గురించి మంచు విష్ణుతో మాట్లాడా.. అని పేర్ని నాని అన్నారు. ఆయన దాన్ని డిలీట్ చేశారని చెప్పారని మంత్రి పేర్ని నాని అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…