Macherla niyojakavargam : రాజకీయాల్లో కుల సమీకరణ ఉంటుంది, అన్ని కులాల వాళ్ళను ఆకట్టుకోడానికి నాయకులు ప్రయత్నిస్తారు. ఇది రాజకీయాల వరకే పరిమితం. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కులగజ్జి కొంచెం ఎక్కువ, అది సినిమాల్లో కూడా ఉంది. అయితే కొంతమంది వ్యక్తులు ఇతరులను ఇరికించడానికి ఫేక్ అకౌంట్స్ తో సోషల్ మీడియాలో కులాలను రెచ్చగొడుతూ, లేదా ఇతర కులాలను కించపరుస్తూ పోస్ట్లు పెట్టి సదరు వ్యక్తి కి డామేజ్ చేస్తారు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం దర్శకుడి పరిస్థితి అదే.

ఫేక్ అకౌంట్ నుండి పెట్టిన పోస్ట్…
మాచర్ల నియోజకవర్గం సినిమా దర్శకుడు ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి ట్వీటర్ ఖాతా నుండి 2019 ఎన్నికల ఫలితాల తరువాత వెలువడిన పోస్ట్ అంటూ ఒక పాత ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అందులో ఆంధ్రప్రదేశ్ లోని రెండు కులాలను కించపరుస్తూ వాఖ్యలు ఉన్నాయి. అయితే ఆ అకౌంట్ తనది కాదని ఎవరో ఫేక్ అకౌంట ద్వారా ఇలా పోస్ట్ పెట్టారని రాజశేఖర్ రెడ్డి క్లారిటీ ఇస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నేను స్వతహాగా దివంగత రాజశేఖర్ రెడ్డి అభిమానిని ఎన్నికల తరువాత అభిమానతో ట్వీట్ చేసాను కానీ ఇతర కులాలను కించపరుస్తూ ఎవరి మనోభావాలు దెబ్బతినేలా ట్వీట్ చేయలేదు. ఎవరో కావాలని నన్ను ఇరికించాలని ఇలా ఫేక్ ట్వీట్ చేసారు. అయినా నేను ఈ పోస్ట్ డిలీట్ చేయను అంటూ దాని రీ ట్వీట్ చేసారు.
???????????????????????????????????????? pic.twitter.com/c6C77k6BMO
— M.S.RAJASHEKHAR REDDY (@SrSekkhar) July 26, 2022
Fake tweet by a Fake person has created unnecessary fuss.. unfortunately this has hurt the sentiment of others..VERY SAD and DISAPPOINTING ???????????? I CONDEMN this kind of FALSE PROPAGANDA… https://t.co/OWCHyvwAEB
— nithiin (@actor_nithiin) July 26, 2022
తప్పు చేయలేదు నేను భయపడను అన్నట్లుగా రీ ట్వీట్ చేసారు రాజశేఖర్ రెడ్డి. ఇక ఈ విషయంలో దర్శకుడికి అండగా హీరో నితిన్ నిలిచాడు. ఆ ఫేక్ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ ఒక ఫేక్ పర్సన్ చేసిన ఫేక్ ట్వీట్ అనవసరపు చర్చకు తెర లేపింది. ఇది కొందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండటం విచారకరం. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నేను ఖండిస్తున్నాను. అంటూ ట్వీట్ చేసారు. ఇక నితిన్ అభిమానులు కూడా ఈ ట్వీట్ ఫేక్ అని తెల్చేశారు. అకౌంట్ నేమ్ స్పెలింగ్ సేమ్ లేవని, అదికాక ఇంటి పేరు తరువాత గ్యాప్ లో తేడాలున్నాయని కాబట్టి ఇది ఎవరో కావాలని చేసిన పని అంటూ తెల్చేశారు.
































