Madhumitha & Siva balaji : మధు దగ్గర ఉన్న డబ్బులు చూసి షాక్ అయ్యాను…: నటులు శివ బాలాజీ & మధుమిత

0
28

Madhumitha & Siva balaji : ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ బాలాజీ ఆ తరువాత ఎలా చెప్పను, దోస్త్ సినిమాల్లో నటించారు. అయితే శివ బాలాజీ కి మంచి పేరు తెచ్చిన సినిమా మాత్రం ఆర్య. బన్నీ నటించిన ఆర్య సినిమాలో విలన్ షేడ్ ఉన్న పాత్రలో అజయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత సంక్రాంతి సినిమాతో మరో మంచి హిట్ అందుకున్న శివ బాలాజీ తన 17 ఏళ్ళ వయసులోనే తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ 22 ఏళ్లకే సొంత వ్యాపార సంస్థలను పెట్టాడు. ఇక సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీ వైపు వచ్చిన శివ బాలాజీ నటి మధుమిత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వారి లవ్ స్టోరీ, వైవాహిక జీవితం గురించిన ముచ్చట్లను తాజాగా ఒక ఇంటర్వ్యూలో మధు శివబాలాజీ పంచుకున్నారు.

మధు బాగా పొదుపు చేస్తుంది…

శివ బాలాజీ మధుమిత ఇద్దరి జంట క్యూట్ గా ఉంటుంది. అలానే ఎన్నో జంటలకు ఆదర్శంగా ఉంటూ వారి లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కుటుంబం విషయంలో జాగ్రత్త పడుతూ సాగుతున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో వారి ఆర్థిక విధానాలు వంటివాటి గురించి చెబుతూ శివ బాలాజీ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇంటికి కావాల్సినవన్నీ మధునే చూసుకుంటుంది. నేనిచ్చిన డబ్బులో మొత్తం సరిపెట్టి వాటిలో మళ్ళీ సేవ్ చేస్తుంది.

ఇప్పటివరకు తాను పొదుపు చేసిన డబ్బు గురించి నాకు తెలియదు. రీసెంట్ గా తెలిసీ షాక్ అయ్యాను. ఒక పది రూపాయలు ఇస్తే అందులో మూడు రూపాయలను పొదుపు చేసి దాచడం నాకు అలవాటు అయితే ఆ విషయం శివ బాలాజీ కి చెప్పను అంటూ మధు చెప్పారు. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితిలో డబ్బు ఉపయోగపడుతుంది అందుకే అలా దాచేస్తాను. నా అకౌంట్ లో డబ్బు ఉంటుంది అంటూ చెప్పారు. చాలా సింపుల్ గా జీవించడం అంటే ఇద్దరికీ ఇష్టం, ఎవరికైనా సొంతిల్లు ఉండాలనే కోరిక ఉంటుంది కష్టపడి ఇల్లు కొన్నాం. అలా ఒక్కొక్కటిగా అన్ని గోల్స్ రీచ్ అవుతున్నాం అంటూ చెప్పారు శివ మధు.