Madhunandan : తెలుగు సినిమాకు తేజ దర్శకత్వం వహించిన నువ్వు నేను ద్వారా పరిచయమైన మధునందన్ ఆ తరువాత కొన్ని సినిమాలు చేసారు. రాజమౌళి దర్శకత్వంలోని సై సినిమా లో నటించిన మధునందన్ ఆ తరువాత అమెరికా వెళ్ళిపోయి మళ్ళీ కొన్నాళ్ళకు తిరిగి వచ్చి సినిమా ప్రయత్నాలు చేసారు. ఇక నితిన్ ఫ్రెండ్ గా చాలా సినిమాలు చేసిన మధునందన్ మరోసారి నితిన్ గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది.

మన ఫ్రెండ్స్ లా ఉండి అవకాశలు రాకుండా చేస్తారు…
సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు పరిచయాల ద్వారానే వస్తాయని, మొదట్లో ఇండస్ట్రీ లో అయితే చెన్నై లేదా ఆంధ్ర వాళ్ళు ఉండటంతో, లోకల్ అయిన నాకు పరిచయాలు పెద్దగా లేకపోవడంతో కష్టమైందని చెప్పాడు. ఇక శేఖర్ ఖమ్ములను కలవాలని చాలా ట్రై చేసినా ఇంత వరకు ఆయనతో పనిచేసే అవకాశం రాలేదని చెప్పారు.

ఇక సినిమాల్లో అవకాశాల విషయంలో ఎవరి ప్రయత్నాలు వారివని, పక్కనే ఫ్రెండ్స్ లా ఉన్నా ఏ సినిమాలో నటిస్తున్నారో చెప్పరని, ఒకవేళ చెబితే ఎక్కడికి వెళ్లి పుల్ల వేస్తాడో అన్న అనుమానం. ఇక మనకు వచ్చిన అవకాశాన్ని కూడా నమ్మి ఫ్రెండ్ చెబితే ఆ సినిమా వాళ్ళ దగ్గరకు వెళ్లి మనకు రాకుండా చేసిన వాళ్ళు కూడా ఉన్నారని, కూటి కోసం కోటి విద్యలు అన్న చందంగా అది కూడా ఒక కళే అనుకోవాల్సిన పరిస్థితి. మన వరకు వచ్చి మనం చేయగలిగితే అది అదృష్టం. ఇక ఒకే లాంటి పాత్రలు చేయకూడదని అనుకున్నట్లు మధు తెలిపారు. బిజీగా ఉండాలి కదా అని, ఖాళీగా ఉండలేక ఒకే లాంటి పాత్రలు చేస్తుపోతే కెరీర్ ఏం ఉండదని, అందుకే నెమ్మదిగా అయినా సరే మంచి పాత్రలే చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.































