MaheshBabu: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఓ వైపు పొలిటికల్ సపోర్ట్ మరోవైపు హీరో మహేష్ బాబు క్రేజ్ ను ఉపయోగించుకుని టాలీవుడ్ లో తన ముద్ర చాటుకునేందు సిద్దం అవుతున్నాడు గల్లా అశోక్.
‘హీరో’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంక్రాంతి బరిలో నిలిచి తన లక్ ను పరీక్షించుకోబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లను కూడా మొదలు పెట్టారు. అశోక్ గల్లాతో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ పై మంచి స్పందన వస్తోంది. ఇక ఏ కొత్త కథానాయకుడు అశోక్ గల్లా ఏ రేంజ్ హిట్ కొడుతాడో చూడాలి. ఇదిలా ఉంటే తన ఫ్యామిలీ మ్యాటర్స్ పై ఈజీగా ఓపెన్ అవుతున్నాడు ఈ కుర్ర హీరో.
తన మామాయ్య ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఆసక్తికర వివారాలను బయటపెట్టాడు. మహేష్ బాబు లాంటి వ్యక్తిని తానింత వరకు చూడలేదని చెబుతున్నాడు. మహేష్ బాబు ఇంట్లో చాలా కూల్ అని.. అల్లరిగా ఉంటారని.. పిల్లలతో కూడా ఇట్టే కలిసిపోతారని చెబుతున్నాడు గల్లా అశోక్. ఆయనతో కనెక్ట్ అయితే ఎదుటివారు కూడా చాలా హ్యాపీగా ఉండేలా చేస్తారని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన ప్రతీ విషయంలో క్లోజ్ గా ఉంటారని… ఎనర్జిటిక్ గా కనిపిస్తారని అశోక్ గల్లా తెలిపాడు. ఇదిలా ఉంటే ఇంకో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఓ సారి నేను మహేష్ పక్కన ఉండగానే బీర్ తాగానని.. ఈ సమయంలో మహేష్ ఓ లుక్కు ఇచ్చారని… నువ్వు బీరు కూడా తాగుతావా అని అడిగారని తెలిపాడు. ఇలా అడగటంతో నేను సైలెంట్ గా ఉండిపోయానిని తెలిపాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…