Featured

VN Adithya: ‘‘పదవిలో ఉన్నంత వరకు హీరో.. తర్వాత జీరో’’..! కానీ హీరో ఎప్పుడూ హీరోనే..

VN Adithya: టాలీవుడ్, ఏపీ ప్రభుత్వాల మధ్య థియేటర్ల టికెట్ ధరలు తగ్గింపు వివాదం అలాగే ఉంది. ఇది రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇటు టాలీవుడ్ ప్రముఖల వ్యాఖ్యలు, అటు వైసీపీ నాయకులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇలసాగుతోంది టికెట్ల వివాదం. ఇప్పటికే నాని, సిద్ధార్థ్ వంటి వారు నేరుగా ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు.

VN Adithya: ‘‘పదవిలో ఉన్నంత వరకు హీరో.. తర్వాత జీరో’’..! కానీ హీరో ఎప్పుడూ హీరోనే..

దీనికి ప్రతిగా వైసీపీ మంత్రి పేర్ని నాని కూడా తనదైన శైలిలో కౌంటర్లు కూడా ఇచ్చారు.  ఇదిలా ఉంటే ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలు తరుచు టికెట్ ధరలపై చేస్తున వ్యాఖ్యలు సమస్యను మరింత పెంచుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాతలు బలిసి ఉన్నారు’ అనే వ్యాఖ్యలు టాలీవుడ్ ఆగ్రహానికి కారణమైంది.

VN Adithya: ‘‘పదవిలో ఉన్నంత వరకు హీరో.. తర్వాత జీరో’’..! కానీ హీరో ఎప్పుడూ హీరోనే..

ఇప్పటికే నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్ .. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.  ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఘాటుగానే స్పందించారు. ‘ బలుపుంటే తప్పేంట్రా బడా చోర్’ అంటూ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యలు చేశారు.

సినిమా వాడు ఒకసారి హిట్ కొడితే..

‘సినిమా వాళ్లకుళ్ల బలుపెక్కువ..”ఈ మాట వినగానే ఒక్క క్షణం మనసు చివుక్కుమంది.. ఇక్కడి వాళ్ల కష్టాలు గుర్తుకు వచ్చాయి .. కానీ తర్వాత స్వాభిమానంతో ఆలోచిస్తే, నిజమే కదా ”బలుపు” ఎందుకుండకూడదు అనిపించింది.. ఈ మాట అన్నవాడు, వాడి జీవితంలో ఒక అయిదు వేల మంది పాత్రల్ని కలుస్తాడేమో పర్సనల్ గా..ఒక్క సినిమా వాడు మాత్రమే సినిమాకొకయాభై మంది చొప్పునయాభై ఏళ్లలోళ్ల రెండు లక్షలయాభైవేల పైచిలుకు పాత్రల్ని కలిసేస్తాడు..ఎంత అనుభవం వస్తుంది తర్వాత తరాలకి అందించడానికి.. ఆ మాత్రం బలుపుండచ్చు.. నీ సినిమా వాడు భూమ్మీద మనిషి మనుగడ ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోతాడు..సినిమా రూపంలో. రాజకీయ నాయకుడు గెలిచి, పదవిలో ఉన్నంత వరకే హీరో.. మిగిలిన జీవితమంతా జీరో.. కానీ సినిమా వాడు ఒకసారి హిట్ కొడితే, లైఫ్ లాంగ్ అండ్ ఆఫ్టర్ఫ్ట లైఫ్ కూడా హీరోయే..ఏదో ఒక కళలో నిష్ణాతుడికే బలుపుండచ్చు..అంటే, అరవై నాలుగు కళల సమాహారమైన మాధ్యమంలో బతికే ఇరవై నాలుగు క్రాఫ్టుల సినిమా వాడికి ఎంతైనా బలుపుండచ్చు..ఒక రాజకీయ నాయకుడి ఎన్నికల ప్రచారానికి సినిమా వాడు సాయపడతాడు.. ఒక్క సినిమా టిక్కెట్టు తెగడానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడూ, అతని ప్రచారమూ పనికి రావు.. ప్రేక్షకుడిమౌత్ టాక్ తప్ప.. మరి బలిసి కొట్టుకోడంలో తప్పేం ఉందిరా బ్లడీ ఫూల్.. అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago