VN Adithya: టాలీవుడ్, ఏపీ ప్రభుత్వాల మధ్య థియేటర్ల టికెట్ ధరలు తగ్గింపు వివాదం అలాగే ఉంది. ఇది రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇటు టాలీవుడ్ ప్రముఖల వ్యాఖ్యలు, అటు వైసీపీ నాయకులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇలసాగుతోంది టికెట్ల వివాదం. ఇప్పటికే నాని, సిద్ధార్థ్ వంటి వారు నేరుగా ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు.

దీనికి ప్రతిగా వైసీపీ మంత్రి పేర్ని నాని కూడా తనదైన శైలిలో కౌంటర్లు కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలు తరుచు టికెట్ ధరలపై చేస్తున వ్యాఖ్యలు సమస్యను మరింత పెంచుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాతలు బలిసి ఉన్నారు’ అనే వ్యాఖ్యలు టాలీవుడ్ ఆగ్రహానికి కారణమైంది.

ఇప్పటికే నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్ .. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఘాటుగానే స్పందించారు. ‘ బలుపుంటే తప్పేంట్రా బడా చోర్’ అంటూ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యలు చేశారు.
సినిమా వాడు ఒకసారి హిట్ కొడితే..
‘సినిమా వాళ్లకుళ్ల బలుపెక్కువ..”ఈ మాట వినగానే ఒక్క క్షణం మనసు చివుక్కుమంది.. ఇక్కడి వాళ్ల కష్టాలు గుర్తుకు వచ్చాయి .. కానీ తర్వాత స్వాభిమానంతో ఆలోచిస్తే, నిజమే కదా ”బలుపు” ఎందుకుండకూడదు అనిపించింది.. ఈ మాట అన్నవాడు, వాడి జీవితంలో ఒక అయిదు వేల మంది పాత్రల్ని కలుస్తాడేమో పర్సనల్ గా..ఒక్క సినిమా వాడు మాత్రమే సినిమాకొకయాభై మంది చొప్పునయాభై ఏళ్లలోళ్ల రెండు లక్షలయాభైవేల పైచిలుకు పాత్రల్ని కలిసేస్తాడు..ఎంత అనుభవం వస్తుంది తర్వాత తరాలకి అందించడానికి.. ఆ మాత్రం బలుపుండచ్చు.. నీ సినిమా వాడు భూమ్మీద మనిషి మనుగడ ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోతాడు..సినిమా రూపంలో. రాజకీయ నాయకుడు గెలిచి, పదవిలో ఉన్నంత వరకే హీరో.. మిగిలిన జీవితమంతా జీరో.. కానీ సినిమా వాడు ఒకసారి హిట్ కొడితే, లైఫ్ లాంగ్ అండ్ ఆఫ్టర్ఫ్ట లైఫ్ కూడా హీరోయే..ఏదో ఒక కళలో నిష్ణాతుడికే బలుపుండచ్చు..అంటే, అరవై నాలుగు కళల సమాహారమైన మాధ్యమంలో బతికే ఇరవై నాలుగు క్రాఫ్టుల సినిమా వాడికి ఎంతైనా బలుపుండచ్చు..ఒక రాజకీయ నాయకుడి ఎన్నికల ప్రచారానికి సినిమా వాడు సాయపడతాడు.. ఒక్క సినిమా టిక్కెట్టు తెగడానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడూ, అతని ప్రచారమూ పనికి రావు.. ప్రేక్షకుడిమౌత్ టాక్ తప్ప.. మరి బలిసి కొట్టుకోడంలో తప్పేం ఉందిరా బ్లడీ ఫూల్.. అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.





























