Mahesh Babu Fans: పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఓవర్ సీస్ లో కూడా సర్కారు వారి పాట సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగులో మాత్రమే విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే నూరు కోట్ల క్లబ్ లో కి చేరడం మాములు విషయం కాదు. ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు మహేష్ బాబు నటనను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలోని మహేష్ బాబు నయా లుక్ అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటోంది.

టీ వి 9 పై ఫైర్ అవుతున్న మహేష్ ఫాన్స్ …..

సర్కారు వారి పాట సినిమా విడుదలైన తర్వాత మిశ్రమ స్పందన తెచ్చుకున్న నేపథ్యంలో… టీవీ9 ఒక ప్రోగ్రాం ని ప్రసారం చేసింది. సర్కారు వారి పాట సినిమా చూసేందుకు ఎవరూ రాక థియేటర్లు ఖాళీగా ఉన్నాయి అంటూ టీవీ9 లో ఒక ప్రోగ్రాంని ప్రసారం చేశారు. దీంతో మహేష్ బాబు అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. తమ అభిమాన నటుడి సినిమా గురించి ఇలా ప్రసారం చేయడంతో టీవీ9 ఛానల్ ని టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు ఫ్యాన్ టీవీ9 ఒక ఆట ఆడేసుకున్నారు.
దెబ్బకు దిగొచ్చిన టీవీ 9…..
Both Tags Are Trending????????#LanjakodukaTV9 #SarkaruVaariPaata ????@urstrulyMahesh #BlockbusterSVP #MaheshBabu pic.twitter.com/QV2ONGY2Mb
— Yogi Chowdary DHFM???? (@urstrulyyogi_) May 15, 2022
సర్కారు వారి పాట సినిమాను దెబ్బతీసేలా టీవీ9 ప్రోగ్రాం ప్రసారం చేయడంతో హర్ట్ అయిన ఫాన్స్.. టీవీ9 ఛానల్ ను ట్విట్టర్ వేదికగా ఘోరంగా ట్రోల్ చేశారు. దీంతో టీవీ9 పేరుతో ఒక హాష్ టాగ్ కూడా ట్విట్టర్ లో ట్రెండ్ లోకి వచ్చింది. దీని ఫలితంగా టీవీ9 ముందు ప్రసారం చేసిన ప్రోగ్రాం పూర్తిగా విరుద్ధంగా.. ‘రూ. 100 కోట్ల క్లబ్ లోకి సర్కారోడు. రిలీజైన సౌండ్ ఇచ్చే రికార్డు ‘ అని మరొక ట్వీట్ చేసింది.



































