Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక రాజమౌళి సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగిస్తూ ఒక విజువల్ వండర్ లా జక్కన్న సినిమాలను తీర్చిదిద్దుతారు. ఇక మహేష్ బాబు కోసం సరికొత్త టెక్నాలజీని కూడా ఈయన ఉపయోగించబోతున్నారని తెలుస్తోంది. ఇలా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా రెండు సంవత్సరాల పాటు తన డేట్స్ ఇచ్చేసారని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమా కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని చెప్పాలి ఏకంగా మహేష్ బాబు ఈ సినిమా కోసం 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట.
అయితే మహేష్ బాబు ఈ 100 కోట్ల రూపాయలను కూడా నిర్మాణంలో భాగం చేస్తూ ఈ సినిమా లాభాలలో వాటా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్ హీరో కాకపోయినా ఈయన సినిమాకు వందకోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకు నలభై నుంచి 50 కోట్లు తీసుకుంటున్నటువంటి మహేష్ బాబు ఏకంగా రాజమౌళి సినిమాకు 100 కోట్లు అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…