Featured

Balakrishana – Mahesh Babu: బాలయ్యతో సందడి చేయబోతున్న మహేష్ బాబు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Balakrishana – Mahesh Babu: ఆహా ఓటీటీ లో నందమూరి బాలకృష్ణ చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె దేశంలోనే నెంబర్ వన్ టాక్ షో గా కొనసాగుతోంది. బాలయ్య బాబు తనదైన శైలిలో చేస్తున్న ఈ టాక్ షో కు మంచి క్రేజ్ ఉంది. ఐఎండిబి లో కూడా ఈ టాక్ షో 9.8 రైటింగ్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ టాక్ షోలో 9 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ 9 ఎపిసోడ్ లో బాలకృష్ణ పలువురు సినీ ప్రముఖులతో ముచ్చటిస్తూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచారు.

Balakrishana – Mahesh Babu: బాలయ్యతో సందడి చేయబోతున్న మహేష్ బాబు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇప్పుడు ఈ షో తొలి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా ప్రిన్స్ మహేష్ బాబు రానున్నారు. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
నందమూరి అభిమానులతో పాటు మహేష్ బాబు అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ కోసమే ఎదురు చూస్తున్నారు.

Balakrishana – Mahesh Babu: బాలయ్యతో సందడి చేయబోతున్న మహేష్ బాబు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తాజాగా ఈ ముగింపు ఎపిసోడ్ స్ట్రీమింగ్ తేదీని ఆహా ప్రకటించింది. ఫిబ్రవరి 4వ తేదీ ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది, దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇటీవల అబ్బాయి తారక్ హోస్ట్ గా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు రియాల్టీ షో చివరి ఎపిసోడ్ కోసం కూడా మహేష్ బాబు ముఖ్య అతిథిగా రావడం విశేషం.

ఎన్టీఆర్.. కృష్ణ ప్రస్తావన..

బాలకృష్ణ, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ చివరి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాల కృష్ణ మహేష్ బాబు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు.. మహేష్ బాబు ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు అనే విషయాల గురించి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్, కృష్ణ ప్రస్తావన ఏమైనా తీసుకువస్తారా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago