Mahesh Babu కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరోసారి కొత్త వేరియంట్ రూపంలో తన పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు కమల్ హాసన్, కరీనా కపూర్, అర్జున్ వడివేలు వంటివారు ఈ మహమ్మారి బారిన పడి సురక్షితంగా కోలుకున్నారు. మరోవైపు టాలీవుడ్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్న మంచు మనోజ్ కరోనా బారిన పడగా.. నిన్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా కరోనా బారిన పడ్డారు.

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కరోనా బారిన పడినట్టు అయన స్వయంగా తెలిపారు.. స్వల్ప లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.. తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్ టెస్ట్‌లు చేసుకోవాలని ట్విటర్ ద్వారా సూచించారు. అదే విధంగా ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకొని వారు ఉంటే తప్పని సరిగా చేయించుకోవాలని దాని వల్ల ప్రాణాపాయం నుంచి సులభంగా తప్పించుకోవచ్చని సూచించారు మహేష్ బాబు.
— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2022



























