Mahesh Babu : ఒక్కొక్కరికి ఒక్కో ఫాషన్ ఉంటుంది. ఆ ఫాషనే వాళ్లను ఎక్కడికో తీసుకెళ్తుంది. ఏ పని చేయాలన్నా.. ఆ పని మీద ఎంతో ఆసక్తి ఉండాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించే. ఆయనకు సినిమాలంటే ఎంత పిచ్చో అందరికీ తెలుసు. తను చదువుకునే సమయంలో కూడా తనకు తెలిసింది సినిమాలేనట. ఆ తర్వాత క్రికెట్. తను కాలేజీలో చదువుతున్న సమయంలో క్రికెట్ ఎక్కువగా ఆడేవారట. ఆ తర్వాత సినిమాలు. థియేటర్లలో ఎక్కువగా సినిమాలు చూడటం మహేశ్ బాబుకు ఇష్టమట. సినిమాలు చూడటం కోసమే మహేశ్ బాబు వేరే సిటీలకు వెళ్తుంటారట. ముఖ్యంగా సినిమాలు చూడటం కోసం మహేశ్ బాబు.. ఎక్కువగా ముంబైకి వెళ్తుంటారట. ముంబై వెళ్లి సినిమాలు చూసి వస్తుంటారట. దుబాయ్, సింగపూర్ వెళ్లినప్పుడు కూడా సినిమాలు ఎక్కువగా చూస్తారట మహేశ్ బాబు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మహేశ్ బాబు.. తన బాల్యం గురించి, తన సినిమా జీవితం గురించి చెప్పుకొచ్చారు. తను చిన్నప్పుడు రెండు మూడు సినిమాల్లో నటించారు. అయితే.. మధ్యలో ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు చదువులో వెనకబడ్డారు మహేశ్ బాబు. దీంతో ఒక సంవత్సరం చదువును లాస్ అయ్యారట మహేశ్ బాబు. దీంతో.. ఇక అప్పటి నుంచి చదువు మీద దృష్టి పెట్టారట మహేశ్ బాబు.

Mahesh Babu : నేను హీరో అవ్వాలని డిసైడ్ చేసింది కూడా నాన్నే..
మహేశ్ బాబుకు, తన తండ్రి కృష్ణకు మధ్య మంచి అనుబంధమే ఉంది. తన చిన్నతనంలోనే మహేశ్ బాబు తన తండ్రితో పాటు నటించారు. కానీ.. చదువు వెనకబడకూడదని.. సినిమాలు ఆపేయించి.. ముందు చదువుకో.. చదువు అయిపోయాక.. సినిమాల్లోకి రావచ్చు.. అంటూ కృష్ణ చెప్పడంతో వెంటనే మహేశ్ బాబు సినిమాల్లో నటించడం ఆపేసి.. చదువు మీద దృష్టి పెట్టారట. అలా.. మహేశ్ బాబు సూపర్ స్టార్ అవ్వడం వెనుక ఉన్నది కృష్ణే.

Mahesh Babu : నాకు తెలుగు చదవడం రాదు..
మహేశ్ బాబు తెలుగు, తమిళం భాషలను అనర్గళంగా మాట్లాడుతారు. కానీ.. ఆయనకు తెలుగు చదవడం రాదు. చిన్నప్పుడు ఆయన ఎక్కువగా చెన్నైలో ఉండటం వల్ల.. తెలుగు చదవడం రాదు. అలాగే… మహేశ్ బాబు తెలుగును తన అమ్మమ్మ దగ్గర ఎక్కువగా నేర్చుకున్నారట. తన భాష చాలా నాచురల్ గా.. ఇంట్లో మాట్లాడినట్టుగానే ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటుంది.

Mahesh Babu : మొదట్లో నాకు పారితోషకం కూడా ఇవ్వలేదు
మహేశ్ బాబు సినిమా కెరీర్ మొదట్లో పారితోషకం విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారట. తన కెరీర్ బిగినింగ్ లో కొన్ని సినిమాలకు అయితే.. తనకు ఇవ్వాల్సిన పారితోషకాన్ని ఇవ్వలేదట. చాలామంది ఎగ్గొట్టారట. తన ఫస్ట్ హాఫ్ కెరీర్ లోని అన్ని సినిమాలకు పర్ ఫెక్ట్ గా పారితోషకం అయితే అందలేదట. ముందు మాట్లాడుకున్నంత పారితోషకం ఎప్పుడూ నిర్మాతలు ఇవ్వలేదట. సూపర్ స్టార్ కృష్ణ కొడుకు అయినా కూడా మహేశ్ కు చాలామంది నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారట. అయితే.. తన సినిమాలు ప్లాఫ్ అయితే.. మహేశ్ కూడా నిర్మాతలను బలవంతం పెట్టకపోయేవారట. సినిమాకు నష్టం వస్తే.. తనకు పారితోషకం ఇవ్వకున్నా మహేశ్ వదిలేసేవారట.

చాలామంది తనను రిజర్వ్ డ్ పర్సన్ అని అంటుంటారు కానీ.. తను తెలియని వాళ్లతో మాత్రం పెద్దగా కనెక్ట్ కారు కానీ.. తనకు తెలిసిన వాళ్లు అయితే సరదాగానే ఉంటానంటున్నారు మహేశ్ బాబు. తనకు ఎవరైనా పరిచయం అయినప్పుడు కొద్దిగా వాళ్ల గురించి తెలిశాక అప్పుడు వాళ్లతో సరదాగానే ఉంటానన్నారు. కాకపోతే తెలియని వాళ్లతో ఎక్కువగా మాట్లాడను.. అని మహేశ్ చెప్పారు.



























