Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన త్వరలోనే రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా రాజమౌళి సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే మహేష్ బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈయన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరి సరసన నటించారు. ఈ క్రమంలోనే మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఈ హీరోయిన్లతో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకుంటారని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ మళ్లీ మళ్లీ హీరోయిన్లతో షేర్ చేసుకోవాల్సి వస్తే షేర్ చేసుకుంటానని తెలిపారు. త్రిషతో నటించడం చాలా సులభంగా ఉంటుందని అంతేకాకుండా తనతో నా స్క్రీన్ స్పేస్ బాగుంటుందని తెలిపారు. ఇలా మా ఇద్దరి మధ్య సీన్స్ అద్భుతంగా ఉండడానికి కారణం మా ఇద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అని ఈయన తెలిపారు.
ఫ్రెండ్షిప్ కారణం…
ఇక త్రిష తర్వాత సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తాను ఇష్టపడతానని తెలిపారు. అయితే ఈయన భార్య నమ్రత కూడా హీరోయినే, ఈమెతో కలిసి కూడా మహేష్ బాబు సినిమాలలో నటించారు కానీ ఈయన మాత్రం తన భార్య పేరు చెప్పకుండా త్రిష సమంత అంటూ తనకి ఇష్టమైనటువంటి హీరోయిన్లు మళ్లీమళ్లీ సినిమాలలో నటించాలనుకునే హీరోయిన్ల గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























