Major : నవంబర్ 2008 ముంబాయి ఎటాక్ లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా మేజర్. ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర‍్శకత్వం వహించగా మహేష్ బాబు నిర్మాతగా వ్యవహారించారు. ఈ సినిమాలో విలక్షణ నటుడు అయిన అడవి శేష్ మేజర్ సందీప్ పాత్రలో నటించిగా, ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందుతోంది. విమర్శకుల నుంచి సైతం మంచి ప్రశంసలు అందుకుంటోంది. ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు.

సినిమా సందీప్ జీవితాన్ని ప్రతిబింబించేలా…..

తెలుగు హిందీ బాషలో అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మేజర్ సందీప్ తల్లిదండ్రులు చూసి భావోద్వేగానికి లోనయ్యారు. సినిమాను చూసిన సందీప్ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక సందీప్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ…. ‘‘మేజర్ సినిమాను సందీప్ జీవితాన్ని ప్రతిబింబించేలా చాలా చక్కగా తీశారు”. నటీనటుల నటనతో పాటు సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ చాలా బాగుంది. ఈ సినిమాను మా దుఃఖాన్ని మరిచేలా తీసారు అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
'Sandeep has fought till his last breath & beyond. He continues to motivate all of us'
— Major (@MajorTheFilm) June 3, 2022
Mr. Unnikrishnan at the special premieres in Hyderabad.#MajorTheFilm ????????@AdiviSesh @saieemmanjrekar #SobhitaD @SashiTikka @urstrulyMahesh @SonyPicsIndia @GMBents @AplusSMovies pic.twitter.com/GIuN5w4uFO
సందీప్ చనిపోలేదు, తుది శ్వాస విడిచే వరకు ఎంతో మంది ప్రాణాలు కాపాడి ఎంతోమందికి స్పూర్తిగా వున్నాడు. హైదరాబాద్ లో సందీప్ తో గడిపిన రోజులు, హైదరాబాద్ తో వారికి వున్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు హైదరాబాద్ లో వున్నందుకు గర్వపడుతున్నాను, తిరిగి త్వరలోనే హైదరాబాద్ వస్తామని చెప్పారు.


































