Makeup Man Madhavarao : కృష్ణగారి పర్సనల్ మేకప్ మ్యాన్ గా కొన్నేళ్లుగా ఆయనతో కలిసి పనిచేసిన మాధవరావు గారు కృష్ణ గారు మరణించిన తరువాత పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటూ ఆయనతో ఉన్న అనుబంధం అలాగే ఇండస్ట్రీ లో వచ్చిన మార్పులు అప్పట్లో మేకప్ ఎలా ఉండేది అప్పుడు ఉన్న హీరోలు ఎలా ఉండేవారు వంటి విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణ, సావిత్రి, వాణిశ్రీ వంటి అగ్ర తారలకు మేకప్ చేసిన ఆయన ఆ విశేషాలను అలాగే కృష్ణ గారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని తెలిపారు.

కృష్ణ గారు కొడుకు, భార్య చనిపోవడంతో క్రుంగిపోయారు….
మాధవరావు గారు కొన్నేళ్లుగా కృష్ణ గారితో కలిసి పనిచేయడం వల్ల ఆయన కుటుంబ సభ్యులతో కూడా మంచి అనుబంధం ఉంది. విజయనిర్మల గారి మరణం కృష్ణ గారిని బాగా బాధించింది. ఇక వరుసగా కొడుకు రమేష్ బాబు, భార్య ఇందిరా దేవి మరణించడంతో బాగా క్రుంగిపోయారంటు తెలిపారు.

ఆయనను వెళ్లి కలిసినపుడు పాత విషయాలను గుర్తుచేసుకుంటు ఏడ్చేవారు ఆయన ఏడ్చేసరికి నాకు ఏడుపు వచ్చేది అంటూ మాధవరావు గారు తెలిపారు. కృష్ణ గారు కుటుంబానికి చాలా విలువ ఇచ్చేవారు. అందరిని జాగ్రత్తగా చూసుకున్నారు అందుకే ఆయన భార్య ,కొడుకు మరణం తట్టుకోలేక పోయారు. ఒంటరి అయిపోయానని బాధపడ్డారు అందుకే భార్య పోయాక కొద్ది రోజుల్లోనే ఆయన మరణించారు అంటూ మాధవరావు గారు ఎమోషనల్ అయ్యారు.






























