Mallareddy Institutions MD Preethi Reddy : తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ నుండి మేడ్చల్ ఎమ్మెల్యే గా ఉన్న మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అధినేత మల్లారెడ్డి గారి గురించి పరిచయం అక్కర్లేదు. రాజకీయాల గురించి అవగాహనా ఉన్న వారికీ ఆయన తెలుసు. పాలు అమ్మి జీవితం మొదలు పెట్టినా నేడు రాజకీయవేత్తగా అలాగే విద్యావేత్తగా సక్సెస్ ఫుల్ గా కెరీర్ లో ఉన్నారు. రీసెంట్ గా ఆయన ఆస్తుల మీద ఐటి దాడుల నేపథ్యంలో ఆయన పలు వ్యాపారం నుండి నేను కష్టపడ్డాను అంటూ చెప్పిన స్పీచ్ బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఆ స్పీచ్ గురించి మీమ్స్ అలాగే రీల్స్ రావడం జరిగింది. ఇక ఆయన సక్సెస్ గురించి కుటుంబంకి ఇచ్చే విలువ గురించి ఆయన కోడలు మల్లారెడ్డి గ్రూప్ అఫ్ ఇస్టిట్యూషన్స్ ఎండి అలాగే మల్లారెడ్డి సైన్స్ సిటీ చైర్మన్ ప్రీతీరెడ్డి తొలిసారి ఇంటర్వ్యూలో మాట్లాడారు.

మావయ్య కష్టం తెలిస్తే కన్నీళ్లు వస్తాయి…
మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఎండి ప్రీతీ రెడ్డి మల్లారెడ్డి గారి కోడలు. ఆయన రాజకీయ బహిరంగ స్పీచుల్లో కుటుంబం గురించి చెప్పాల్సి వస్తే చెప్పే మాట తన కోడలు ప్రీతీ తనకు మూడో కొడుకు లెక్క అంటూ చెప్తారు. అలా ఆ కుటుంబంలో కలిసి పోయి బాధ్యతలను పంచుకున్న ప్రీతీ రెడ్డి గారు తన అత్తింటి గురించి అలాగే తన మావగారి గురించి ఇంటర్వ్యూలో మాట్లాడారు.

తన మావయ్య పాలు అమ్మినప్పటి నుండి నేను చూడకపోయినా అప్పటి ప్రతి విషయంలో మా అత్తమ్మ ఆయనకు తోడుగా ఉన్నారు. ఆవిడ మాకు ఆయన పడిన కష్టాలను చెప్పి కన్నీళ్లు పెట్టుకునేవారు. భద్రా రెడ్డి గారిది నాది ప్రేమ వివాహం అయినా కూడా వేరే క్యాస్ట్ అమ్మాయిని అనే భావన కుటుంబంలో ఎవరూ రానివ్వలేదు. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అత్త మామలు కొడుకుల్ని కోడళ్ళను అలాగే కూతురు అల్లుడికి సమాన స్థానం ఇచ్చారు అంటూ ప్రీతీరెడ్డి తన మావయ్య మంత్రి మల్లారెడ్డి గురించి వివరించారు.