Malvika Avinash: ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా నుంచి టీజర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా టీజర్ విడుదలైన తర్వాత ఎన్నో విమర్శలకు కారణమవుతోంది. అలాగే ఈ టీజర్ ఎన్నో వివాదాలను కూడా ఎదుర్కొందని చెప్పాలి.ఇకపోతే కొందరు రాజకీయ నాయకులు అలాగే సినీ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున ఈ సినిమా టీజర్ లో తప్పులను బయటపెడుతూ వివాదాలను తెరపైకి తీసుకువస్తున్నారు.
ఈ క్రమంలోనే కేజిఎఫ్ సినిమాలో నటించినటువంటి నటి మాళవిక అవినాష్ డైరెక్టర్ ఓం రౌత్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో నటించిన పాత్ర గురించి ఈమె మాట్లాడుతూ అసలు రావణాసురుడు ఎలా ఉండాలో తెలియాలంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన సినిమాలను చూసి నేర్చుకోండి అంటూ కామెంట్ చేశారు.
ఆది పురుష్ సినిమాలో రావణాసురుడు ఏమాత్రం బాగాలేదని ఈమె మండిపడ్డారు. రావణాసురుడికి నీలి కళ్ళు లెదర్ జాకెట్ తొలగించడం ఏంటి. ఇలా రావణాసురుడి లెదర్ జాకెట్ తొడిగించడం అంటే రామాయణాన్ని అవమానించడమే అంటూ ఈమె పెద్ద ఎత్తున మండిపడ్డారు.అసలు సిసలైన రావణాసురుడి పాత్ర ఎలా ఉండాలో నందమూరి తారక రామారావును చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు.
రాముడైనా, కృష్ణుడైన, అర్జునుడైన,అలాంటి పాత్రలలో ఒదిగిపోయి నటించడంలో నందమూరి తారక రామారావుకు ఎవరు సాటి లేరని ఆయన తర్వాతే ఎవరైనా అంటూ అభిమానులు నెటిజనులు కూడా నటి మాళవిక అవినాష్ కు మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా ఎన్నో అంచనాల నడుమ ఈ టీజర్ విడుదల అయితే ప్రేక్షకుల ఆదరణ కన్నా, పెద్ద ఎత్తున విమర్శల పాలైందని చెప్పాలి.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…