Manchu Lakshmi : తన తెలుగుతో మనకు నరకం చూపిస్తున్న మంచు లక్ష్మక్క లైఫ్ స్టోరీ… మొదటి పెళ్లి ఎందుకు విఫలమైంది…!

0
843

Manchu Lakshmi : మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మి తన భాష యాసతో మరింత ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ట్రోలర్స్ కి ఈమె ఏదైనా వేడుకలో మాట్లాడితే పండగే. ప్రస్తుతం టీవీ షోస్ చేయకుండా కేవలం సినిమాలతో బిజీగా ఉన్న లక్ష్మి మంచు రీసెంట్ గా మలయాళం సినిమా మాన్స్టర్ లో లెస్బియన్ లాగా నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. తన నటనతో మల్లు అభిమానులను ఆకట్టుకుంది కానీ తెలుగులో మంచి అవకాశాలు మాత్రం అందుకోలేదు. బాహుబలిలో శివగామి వంటి మంచి పాత్ర వస్తే ప్రభాస్ కి తల్లిగా నేను చేయను అంటూ డ్రాప్ అయిందట. ఇక ఆ తరువాత అక్కకి తెలుగు సినిమాల్లో పెద్దగా ఆఫర్స్ రాలేదు. తాజాగా తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని కూడా తెలుగు ప్రేక్షకులకు చూపించింది. అయితే లక్ష్మక్క అసలు అమెరికా ఎందుకు వెళ్లింది మళ్ళీ అక్కడి నుండి ఇండియా ఎందుకు వచ్చేసింది ఈ విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

మొదటి పెళ్లి విఫలం అవ్వడానికి కారణం…

మంచు లక్ష్మక్క పుట్టి పెరిగింది చెన్నైలో, అక్కడే చదువుకోవడం వల్ల అక్క తెలుగు అలా ఉంటుంది. ఇక ఇంటర్ కి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి అమ్మమ్మ వాళ్ళింట్లో ఉండి చదువుకున్న ఆమె ఫ్యాషన డిజైనింగ్ హైదరాబాద్ లో చేసింది. అయితే అపుడే లండన్ శ్రీనివాస్ అనే వ్యక్తితో ప్రేమలో పడి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని కాపురం పెట్టేసింది. కొద్దిరోజులకు ఎక్కడ ఉండేది తెలుసుకుని మోహన్ బాబు మైనారిటీ తీరలేదు అంటూ లక్ష్మక్క ని తన నెట్వర్క్ ఉపయోగించి భర్తతో విడదీసి అమెరికా పంపేసాడు.

రీసెంట్ గా తెలంగాణ కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి తెలంగాణ ఐటి హబ్ సీఈఓ శ్రీనివాస్ గురించి చెబుతూ మంచు లక్ష్మక్క మొదటి భర్త ఈయనే అని చెప్పేవరకు చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇక అమెరికా వెళ్లిన లక్ష్మి తండ్రి మీద కోపం తో అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ తన డబ్బు తానే సంపాదించుకుని థియేటర్ ఆర్ట్స్ లో కోర్స్ చేసింది. అలా హాలీవుడ్ లో అడుగుపెట్టి లాస్ వేగాస్ అనే సిరీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తరువాత డిస్పరేట్ హౌస్ వైవ్స్, లేట్ నైట్ విత్ మై లవర్ వంటి సిరీస్ లతో నటించి అలాగే పర్ఫెక్ట్ లైవ్స్ అనే షార్ట్ ఫిల్మ్ కూడా డైరెక్షన్ చేసింది. ఇక మళ్ళీ 2006 లో చెన్నై కి చెందిన బ్రహ్మాణ కుటుంబానికి చెందిన ఐటీ ప్రొఫెషనల్ శ్రీనివాసన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లక్ష్మి అనారోగ్యం సమస్యలతో బాధపడటం వల్ల సరోగసి ద్వారా విద్యా నిర్వాణ అనే అమ్మాయికి జన్మనిచ్చించి.