Manchu Lakshmi: పుష్ప సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మంచు లక్ష్మి… బన్నీ రష్మిక పై ప్రశంసలు!
Manchu Lakshmi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా రికార్డ్ కలెక్షన్లు కొల్లగొడుతోంది. బన్నీ కేరీర్ లో తొలి ప్యాన్ ఇండియా సినిమా పుష్ప సినిమా విడుదలైంది. రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా రికార్డ్ వసూళ్లను రాబట్టింది. పుష్ప ధాటికి బాలీవుడ్ కూడా షేక్ అయింది. అంతలా హిట్ అయింది ఫుష్ప.
బన్ని కేరీర్లోనే తొలి ప్యాన్ ఇండియా సినిమా ఈరేంజ్ లో హిట్ కావడంతో… అల్లు అర్జున్ ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. హిందీ క్రిటిక్స్ సైతం బన్నీ నటనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఊరమాస్ గెటప్ లో ఎర్రచందనం స్మగ్లర్ గా బన్నీ చేసిన యాక్టింగ్ సూపర్ గా నచ్చింది అందరికి. డిసెంబర్ 17 విడుదలైన ఈ సినిమా థియేటర్ రన్ తో పాటు … ఓటీటీలోకి కూడా వచ్చింది. దిగ్గజ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పుష్ప సినిమాపై మంచువారమ్మాయి మంచు లక్ష్మీ ఓ రేంజ్ లో పొగడ్తలు కురిపించింది. అల్లు అర్జున్ కు హ్యాండ్సప్ చెప్పింది. పుష్ప రాజ్ వంటి క్యారెక్టర్ చేయడం చాలా కష్టం.. కానీ బన్నీ అద్భుతంగా చేశాడు. సినిమాపై నీకున్న ప్రేమ, అంకిత భావం కారణంగానే పుష్ఫ చిత్రం ఇంత బాగా వచ్చింది. ఇక రష్మిక తన నటనతో కేక పెట్టించిందని.. సమంత స్పెషల్ సాంగ్ అయితే అదిరిపోయిందని.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారుని చెప్పుకొచ్చింది. పుష్ప పార్ట్ 2 కోసంఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని వరుస ట్వీట్లలో చెప్పకొచ్చింది మంచువారమ్మాయి.
ప్రస్తుతం కరోనా సోకడంతో మంచు లక్ష్మీ హోం ఐసోలేషన్ లో ఉంది. ఇటీవల తనకు కరోనా సోకినట్లు తెలిపిన లక్ష్మీ…సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ సమాయాన్ని గడుపుతోంది.
తిరుమలలో వైద్య సేవ చేయాలనుకునే వారికి మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. Tirumala Tirupati Devasthanams (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న…
అమ్మాయిల్లో చాలామందికి జుట్టు సరిగ్గా పెరగడం లేదనే ఆందోళన ఉంటుంది. పల్చగా, బలహీనంగా మారిన జుట్టు వల్ల చాలా మంది…
గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…
దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…