Manchu Lakshmi: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మోహన్ బాబు వారసురాలుగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిగా నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న నటి మంచు లక్ష్మి గురించి అందరికీ సుపరిచితమే. ఈమె ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళంలోకి కూడా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.
మలయాళంలో మోహన్ లాల్ నటించిన మాన్ స్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. ఇక ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో మంచు లక్ష్మి ఈ సినిమా గురించి నటుడు మోహన్ లాల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మలయాళంలో తన మొదటి సినిమా కావడం విశేషం ఇక ఇందులో మంచు లక్ష్మి లెస్బియన్ పాత్రలో నటించి నటనలో మరో మెట్టు పైకి ఎక్కారనే చెప్పాలి. ఇకపోతే మళయాలంలో మొదటిసారి నటించడంతో భాష పరంగా కొంచెం మొదట్లో ఇబ్బంది పడ్డానని తాను ఎంతో యాక్టివ్ గా సెట్లోకి వెళితే మీ పాత్ర చాలా మూడిగా ఉంటుందని చెప్పేవారు అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమాలో డైలాగులు చెప్పడానికి కాస్త ఇబ్బంది పడ్డానని డైలాగ్స్ చాలా లెంతీగా ఉండటం వల్ల పలకడానికి ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు.ఇకనట్టుడు మోహన్లాల్ గురించి మాట్లాడుతూ ఆయన ఏ వయసులో కూడా ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలలో నటిస్తూ నటన పట్ల తనకున్న ఆసక్తి ఏంటో తెలియజేశారు. తను లెజెండరీ యాక్టర్ అని అలాంటి వ్యక్తితో ప్రతి ఏడాది ఒక సినిమాలో నటించాలని ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…