Manchu Manoj: మంచు మనోజ్ మౌనిక రెడ్డి దంపతులు ఇటీవల వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలాకాలంగా ఒకరినొకరు ప్రేమించుకున్న వీరు తాజాగా కుటుంబ సభ్యుల అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే ఇది వీరిద్దరికీ రెండవ పెళ్లి కావడంతో ఇద్దరూ కూడా కొంతకాలం ఎన్నో కష్టాలు అనుభవించినట్లు ఇటీవల మనోజ్ వెల్లడించాడు.
తాజాగా వివాహం తర్వాత మనోజ్ మౌనిక రెడ్డి జంటగా వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ” అలా మొదలైంది ” షో లో సందడి చేశారు. ఈ షోలో వారి ప్రేమను గెలిపించుకోవడానికి పడిన కష్టాల గురించి మనోజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో మనోజ్ మాట్లాడుతూ..” మౌనిక కష్టాలు చూస్తే నా కష్టాలు చాలా చిన్నవనపించింది. అయితే మొదట నా ప్రేమను తెలిపినప్పుడు మౌనిక కుటుంబం గురించి సమాజం గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా అని నన్ను ప్రశ్నించింది.
అంతా నేను చూసుకుంటానని చెప్పటంతో మౌనిక నన్ను నమ్మి ఓకే చెప్పిందని మనోజ్ తెలిపాడు. ఈ క్రమంలో చాలా కాలం క్రితం మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి అనే చిత్రం గురించి వెన్నెల కిషోర్ ప్రశ్నించగా… మౌనిక కోసమే ఆ చిత్రాన్ని వదిలేసానని మనోజ్ అసలు విషయం రివీల్ చేశాడు. అహం బ్రహ్మాస్మి కోసం రెండేళ్ల పాటు కష్టపడ్డాం. అదే సమయంలో మౌనికతో నా బంధం ఏర్పడింది. మౌనిక నన్ను నమ్ముకుని బిడ్డతో వచ్చింది.
ఆ సమయంలో నేను కెరీర్ కోసం, డబ్బు కోసం ఆశ పడి ఉంటే నేను బ్రతకడమే వేస్ట్. అందుకే సినిమానా.. మౌనికా అని అనుకున్నప్పుడు నేను మౌనికని ఎంపిక చేసుకొని సినిమా వదిలేసా. అయితే ఆ సమయంలో దర్శకుడు శ్రీకాంత్ ని క్షమించమని కోరా. ఆ తర్వాత
ఇక్కడ ఉంటే మాకు ఇబ్బంది అవుతుందని చెన్నై వెళ్లి ఏడాదిన్నర పాటు అక్కడే ఉన్నాం అంటూ మనోజ్ వెల్లడించాడు. ఎన్నో ఏళ్లుగా స్నేహితులుగా ఉన్న వీరు ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహబంధంలోకి అడుగు పెట్టారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…