Manchu Manoj Marriage : ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మంచు మనోజ్ మౌనిక రెడ్డిల పెళ్లి, మార్చి 3వ తేదీన మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది. మంచు మనోజ్, మోహన్ బాబు కుమారుడిగా అందరికీ సుపరిచితుడు. ఇక భూమా నాగిరెడ్డి రెండో కూతురుగా మౌనిక రెడ్డి పేరు అందరికీ తెలుసు. ముఖ్యంగా నాగిరెడ్డి గారు మరణించిన తరువాత మౌనిక రెడ్డి తన అక్క రాజకీయల్లోకి రావడంతో ప్రచారంలో పాల్గొని తన వాగ్దాటితో అందరినీ ఆకర్శించింది. ఇక ఇప్పుడు మౌనిక రెడ్డి మనోజ్ ను పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరికీ అసలు ఎలా పరిచయం, వీరి మొదటి వివాహం ఎందుకు ఫెయిల్ అయింది అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది.

మౌనిక రెడ్డి మొదటి పెళ్ళికి వెళ్లిన మంచు మనోజ్…
మౌనిక రెడ్డి మొదటి పెళ్లి వ్యాపారవేత్త అయిన గణేష్ అనే వ్యక్తి తో జరుగగా ఆ పెళ్ళికి మంచు మనోజ్, మంచు లక్ష్మి వెళ్లారు. ఇక మనోజ్ కూడా తన వదిన స్నేహితురాలు ప్రణీతను పెళ్లి చేసుకున్నారు. అయితే మౌనిక మనోజ్ లకు వారి పెళ్లిళ్లకు ముందే పరిచయం ఉంది. మౌనిక న్యూయార్క్ లో బ్రాడ్ క్యాస్టింగ్ అండ్ జర్నలిజం కోర్స్ చేస్తున్న సమయంలో అక్కడే మనోజ్ ఫిల్మ్ యాక్టింగ్ కోర్స్ చేసాడు. ఆ సమయంలోనే వారిద్దరికీ పరిచయం ఏర్పడింది.

ఇక వారికి వేర్వేరు వ్యక్తులతో పెళ్లి అయినా కూడా ఇద్దరూ టచ్ లోనే ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అలా ఇద్దరూ చివరికి వారి లైఫ్ పార్టనర్స్ కి డివోర్స్ ఇచ్చి వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ఇక వీరి పెళ్ళికి మొదటి సారి మోహన్ బాబు ఇటు నాగిరెడ్డి ఇద్దరూ ఒప్పుకోలేదట. ఇక రెండో వివాహానికి కూడా మోహన్ బాబు అంత సుమఖంగా లేరంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే మంచు లక్ష్మి అన్నీ తన భుజాన వేసుకుని తన తమ్ముడి పెళ్లిని తన ఇంట్లోనే చేసింది.



































