Manchu Vishnu : ఈ మధ్య సినిమాలు తగ్గించిన మంచు ఫ్యామిలీ మళ్ళీ మోహన్ బాబు సన్ అఫ్ ఇండియాగా వచ్చాడు. ఇక ఈ సినిమా వచ్చింది పోయింది. తనయులు విష్ణు, మనోజ్ లు కూడా పెద్దగా సినిమాలు చేయడం లేదు బాగా తగ్గించారు. ఇక మా అధ్యక్షుడు అయ్యాక విష్ణు మళ్ళీ సినిమా చేస్తున్నారు. గాలి నాగేశ్వర్రావు సినిమాతో మళ్ళీ హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
గాలి నాగేశ్వర్రావు సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న విష్ణు కూతుళ్లు….

మంచు విష్ణు కూతుర్లు అరియానా, వివియానా గాలి నాగేశ్వర్రావు సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టనున్నారు. అయితే సినిమాలో ఏదైనా పాత్రలో నటిస్తారనుకుంటే పొరపాటే. సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్ లో వీళ్లు పాట పాడారట. ఆలా సింగర్స్ గా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నారు. సింగర్స్‌గా వాళ్ళకు ఇది తొలి పాట. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాలోని ఓ పాటను అరియానా, వివియానా పాడటం విశేషం. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ పాట సినిమాకి కీలకంగా ఉండడమే కాకుండా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాను ఏవా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో విష్ణు మంచు నిర్మిస్తున్నారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం కథ, స్క్రీన్ ప్లేను కోన వెంకట్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఇక భాను, నందు సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.