Manoj Nandham : సెలబ్రిటీలు అయినా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. తెరపై నవ్వుతూ కనిపించే సెలబ్రిటీల జీవితాలు నిజ జీవితంలో కూడా అలానే ఉంటాయి అనుకోవడం పొరపాటు. ఎన్నో బాధలు, కష్టాలు ఉన్నా అవకాశన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం తెరపై అవన్నీ వదిలేసి నటిస్తారు. సోషల్ మీడియా వల్ల ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్ ఏదో ఒక ఇంటర్వ్యూ లో తాము పడిన కష్టాలను, ఇబ్బందులను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. అలానే మనోజ్ నందం జీవోతంలోని విషదాన్ని ఇంటర్వ్యూ లో షేర్ చేసుకున్నాడు.

అమ్మను బ్రతికించుకోలేక పోయాను…
ఛత్రపతి సినిమాలో ప్రభాస్ నటన మరచిపోలేము, తల్లి కోసం ఆరాటపడే హీరో క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అలాంటి పాత్రలో చిన్నప్పటి ప్రభాస్ పాత్రలో అలరించిన వ్యక్తి మనోజ్ నందం. చిన్నప్పటి పాత్రలో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అతడు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ హీరోగా సినిమాలు చేసాడు. రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ వంటి సినిమాల్లో నటించినా పెద్దగా ఆ సినిమాలు కెరీర్ కు హెల్ప్ అవలేదు. ఇక మనోజ్ నందం తన కెరీర్ లో చిన్న పాత్రలు కూడా చేస్తూ సినిమాల్లోనే తన కెరీర్ ను నిర్మించుకుంటున్నాడు. ఇక తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదాన్ని ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

తన తల్లి 2012 లో క్యాన్సర్ తో హాస్పిటల్ లో చేరగా చాలా నలిగిపోయానని చెప్పారు. తండ్రి వ్యాపారావేత్త ఓ ఎన్ జీసీ కాంట్రాక్టర్, ఆ తరువాత హ్యాండ్ లూమ్ వ్యాపారం కూడా చేసారు. అయినా కూడా తన వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థికంగా నేను ఆధారం అవ్వాలని సినిమాల్లో ఏ అవకాశం వచ్చినా చేసే వాడిని. సహాయ పాత్రలు అంటూ అన్ని చేశాను అందుకే కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేక పోయాను అంటూ వివరించాడు. అలా 2015 లో తల్లి క్యాన్సర్ తో మరణించినపుడు చాలా క్రుంగిపోయానని చెప్పారు. డబ్బుల్లేక అమ్మను చూసుకోలేకపోయాననే గిల్ట్ అయితే లేదు, కానీ ఎంత డబ్బు ఖర్చుపెట్టినా అమ్మని కాపాడుకోలేకపోయాను అనే గిల్ట్ మాత్రం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్.



























