Medico Suicide : విద్యార్థులు, యువకులలో జీవన సరళి, పోటీతత్వం వల్ల ఒత్తిడి పెరిగి నేటి ఉరుకుల పరుగుల జీవనంతో పోటీ పడలేక, ఒత్తిడి భరించలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. మన ఇండియాలో ఇపుడు ఆత్మహత్యలు అందులోనూ స్టూడెంట్స్ నుండి ఎక్కువయ్యాయి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిన సమయంలో ఒక్కసారి తల్లిదండ్రులు, స్నేహితులు, తోబుట్టువులు ఇలా తమవారితో ఒక్కసారి మాట్లాడితే వారి ఆలోచన మార్చుకుంటారు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఒక మెడికో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

మానసిక సమస్యలతో బాధపడుతున్న యువకుడు…
సికింద్రాబాద్ గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న 21 సంవత్సరాల దీక్షిత్ రెడ్డి అనే యువకుడు ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా దేవరుప్పల గ్రామానికి చెందిన సోమిరెడ్డి, కరుణ దంపతులు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ శివారు పాపిరెడ్డినగర్‌కు వచ్చి నివసిస్తున్నారు. వీరికి ఓ కూతురు, కొడుకు దీక్షిత్ రెడ్డి ఉన్నారు. దీక్షిత్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇప్పటికే చికిత్స తీసుకుంటున్నాడు.

గతంలోను నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడగా ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే తరచూ మందులు వేసుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితి అంటూ బాధపడేవాడు. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల తల్లిదండ్రులు దీక్షిత్ రెడ్డిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయిస్తున్నారు. కుటుంబ సభ్యులు బయటకెళ్లిన సమయంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీక్షిత్ రెడ్డి. తన మర్మాంగాన్ని కోసుకుని అత్యంత బాధాకరంగా అతను మరణించడానికి గల కారణలను పోలీసులు అన్వేషిస్తున్నారు.