Meena : మీనా.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించిన మీనా 90 లలో దక్షిణాది భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలిగారు. 1982 లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించిన మీనా దాదాపు 45 చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. తెలుగులో 1990 లో రాజాంద్ర ప్రసాద్ సరసన నవయుగం సినిమాలో మొదటి సారి హీరోయిన్ గా నటించింది. తరువాత తిరిగి చూసుకొనే పని లేకుండా తెలుగు అగ్ర హీరోల సరసన నటించి హిట్ సినిమాలను తన ఖాతలో వేసుకుంది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న మీనా 2009 లో బెంగళూరు కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యా సాగర్ ను వివాహం చేసుకుంది.

వివాహం తరువాత హీరోయిన్ గా సినిమాలు చేయడం తగ్గించి సహాయ పాత్రలకు ప్రాముఖ్యం ఇచ్చింది. పెళ్లి తరువాత అన్యోన్యంగా వున్న వీరికి 2011 లో కుమార్తె నైనిక జన్మించింది. అయితే ఎంతో సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలో 2022 జూన్ 28న పెను విషాదం చోటు చేసుకుంది. మీనా భర్త విద్యా సాగర్ ఆకస్మిక మరణం చెందారు. లంగ్స్ ఫెయిల్ అవ్వడంతో చికిత్స పొందుతూ చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ వార్తతో అందరు శోక సముద్రంలో మునిగి పోయారు. ఇది ఇలా ఉండగా అభిమానులు, నెటిజెన్ లు విద్యా సాగర్ గురించి, మీనా విద్యా సాగర్ ల వివాహం గురించి ఆరా తీస్తున్నారు.
మీనా – విద్యా సాగర్ ల వివాహం…

2009 వ సంవత్సరం జూలై 12న మీనా – విద్యాసాగర్ ల వివాహం ఆర్య వైశ్య సమాజ్ కళ్యాణ మండపంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. వివాహం తరువాత తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. చెన్నైలోని మేయర్ రామనాథన్ చిట్టియార్ హాల్ లో మీనా, విద్యాసాగర్ ల రిసెప్షన్ ఏర్పాటు చేసి ఇండస్ట్రీ ప్రముముఖులను ఆహ్వానించారు. వీరి రిసెప్షన్ కు దక్షిణాది సినీ తారలంతా తరలివచ్చారు. అయితే పెళ్లి తరువాత సినిమాలలో నటించడానికి కాస్త విరామం తీసుకొన్నారు మీనా.

ప్రస్తుతం మీనా కూతురు నైనికా కూడా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. ఇక మీనా తాజాగా రౌడీ బేబీ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. మీనా భర్త విద్యాసాగర్ మృతితో మీనాతో పాటు వారి కుటుంబ సభ్యులలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.



























