Mega brother Nagababu : మెగాస్టార్ తమ్ముడిగా అందరికీ సుపరిచితుడైనా సినిమాల్లో పెద్దగా కెరీర్ లేకపోయినా బుల్లితెర మీద జబర్దస్త్ కి జడ్జిగా మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగబాబు గారు దాదాపు జబర్దస్త్ పెట్టినప్పటి నుండి పదేళ్ళ పైగానే జడ్జిగా వ్యవహరించిన అక్కడ చిన్న చిన్న విబేధాల కారణంగా బయటికి వచ్చేసారు. ఆయన రావడంతో ఆయనతో పాటు చంద్ర, ఆర్పీ వంటి వారు బయటికి వచ్చేసారు. ఇక ఆ ఛానెల్ ఈ ఛానెల్ తిరిగి చివరకు మా టీవీ లో ఉన్న నాగబాబు గారు ఇటీవల యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల మీద మాట్లాడారు.

ఆరంజ్ సినిమా వల్ల చాలా నష్టపోయాను…
నాగబాబు గారు తన సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ నటన ఏదో గాలివాటుగా చేసానే కానీ సీరియస్ గా తీసుకోలేదు. ఇక నిర్మాతగా కుడా నచ్చిన సినిమాను తీయాలనే తపనే కానీ డబ్బు సంపాదించాలి అని అల్లు అరవింద్, సురేష్ బాబు లాగా ఆలోచించలేదు. అలా ఉండుంటే నిర్మాతగా బాగా సంపాదించేవాడిని కానీ అలా చేయలేదు. ఇక ‘ఆరంజ్’ సినిమా సమయానికి సినిమా నిర్మాణం ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ సినిమా తరువాత మరో సినిమా నిర్మించకూడదని ముందే అనుకున్నాను. అయితే ఆరంజ్ సినిమాకు మరీ అంత నష్టాలు చూస్తానని మాత్రం ఊహించలేదు. సినిమా కోసం చాలా కోట్లు అప్పు చేసాను. సినిమా పోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను.

ఆ సమయంలో కళ్యాణ్, అన్నయ్య నన్ను ఆదుకున్నారు. వాళ్లిద్దరూ లేకపోయింటే చనిపోయేవాడినేమో అలాంటి పరిస్థితి అది. నేను వాళ్ళను సహాయం అడుగలేదు కానీ చేసారు. కొన ఊపిరితో ఉన్న నాకు ప్రాణం పోశారు. ఆ పైన నా పోరాటం నాదే అలా జబర్దస్త్, ఇంకా కొన్ని సీరియల్స్ అంటూ చేసి నిబడ్డాను. నిజానికి జబర్దస్త్ మళ్ళీ నాకు కొత్త గుర్తింపు తెచ్చిపెట్టింది అంటూ ఆరంజ్ సినిమా అనుభవాలను పంచుకున్నారు.



























