Megastar Chiranjeevi: ఏపీలో టికెట్ ధరల రచ్చ సద్దుమనగడం లేదు. ఈ టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య గ్యాప్ పెంచుతోంది. అయినా కూడా టికెట్ల ధరల తగ్గింపు విషయంలో వెనక్కి తగ్గదేలే అంటూ వ్యవహరిస్తుంది జగన్ సర్కార్. గతంలో పవన్ కళ్యాణ్ నేరుగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు. తాజాగా నాని శ్యాం సింగరాయ్ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువగా ఉన్నాయంటూనే.. టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమాన పరిచారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ మంత్రులు కూడా తీవ్రంగానే స్పందించారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్లు పెంచుకునేందకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై టాలీవుడ్ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతఙ్ఞతలు.
ఏపీలో థియేటర్ల కలెక్షన్లు..
సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది’ అని చిరంజీవి ట్విట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు టికెట్ ధరలపై పూర్తి వ్యతిరేఖంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ టాలీవుడ్ కు పూర్తి ప్రెండ్లీగా వ్యవహరిస్తుంటే… జగన్ సర్కార్ తో టాలీవుడ్ కు గ్యాప్ క్రియేట్ అవుతోంది.





























