General News

MEIL: భారీగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులను చేజిక్కించుకున్న మెఘా..! వెల్లడించిన సంస్థ..!

MEIL: హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) తొమ్మిది రాష్ట్రాల్లో 15 సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) ప్రాజెక్టులను చేజిక్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది.
సిజిడి ప్రాజెక్టుల బిడ్‌లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పెట్రోలియం , సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) భారతదేశం అంతటా 65 భౌగోళిక ప్రాంతాల (GA) కోసం CGD ప్రాజెక్ట్‌ల 11వ రౌండ్ బిడ్డింగ్‌కు గతంలో పిలుపునిచ్చిందని తెలిపింది.

MEIL: భారీగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులను చేజిక్కించుకున్న మెఘా..! వెల్లడించిన సంస్థ..!

దీనిలో భాగంగా.. నిర్వహించిన 11వ రౌండ్‌ బిడ్డింగ్‌లో అత్యధిక సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రాజెక్ట్‌లను మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) దక్కించుకుంది. పీఎన్‌జీఆర్‌బీ 19 రాష్ట్రాల్లోని 215 జిల్లాల్లో విస్తరించిన 65 జియోగ్రాఫికల్‌ ఏరియాలకు బిడ్స్‌ నిర్వహించింది. 61 ఏరియాలకు బిడ్స్‌ దాఖలు అయ్యాయి.

MEIL: భారీగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులను చేజిక్కించుకున్న మెఘా..! వెల్లడించిన సంస్థ..!

ఇందులో మేఘా గ్యాస్‌ 15, అదానీ టోటల్‌ గ్యాస్‌ 14, ఐఓసీఎల్‌ 9, బీపీసీఎల్‌ 6 పొందగా మిగిలిన వాటిని ఇతర సంస్థలు చేజిక్కించుకున్నాయి. మొత్తం జియోగ్రాఫికల్‌ ఏరియాల్లో 24.6 శాతం వాటాతో ఎంఈఐఎల్‌ అగ్రభాగాన నిలిచింది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సీజీడీ) ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది.


తెలంగాణలోని పలు జిల్లాల్లో..

61 జియోగ్రాఫికల్‌ ఏరియాలకు సుమారు రూ.80,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని పీఎన్‌జీఆర్‌బీ భావిస్తోంది. ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్‌లను కంపెనీ ప్రాజెక్టులను అమలు చేస్తుంది. అంతక ముందు ఇదే కంపెనీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిడ్డింగ్ 5, 10 రౌండ్లో పాల్గొంది. ఆ రౌండ్‌లో MEIL 07 భౌగోళిక ప్రాంతాలను గెలుచుకుంది. తెలంగాణలో జోగులాంబ గద్వాల్, నాగర్‌ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జియోగ్రాఫికల్‌ ఏరియాలు ఉన్నాయి. ఇప్పటికే నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో పైప్‌లైన్‌ నిర్మాణంతోపాటు 32 సీఎన్‌జీ స్టేషన్లను మేఘా గ్యాస్‌ ఏర్పాటు చేస్తోంది. ఏపీ విషయానికి వస్తే..కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేస్తోంది. కర్ణాటకలో తూముకూరు, బెల్గావిలో కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ను(సీఎన్జీ) మేఘా అందిస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago