MEIL: హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) తొమ్మిది రాష్ట్రాల్లో 15 సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) ప్రాజెక్టులను చేజిక్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది.
సిజిడి ప్రాజెక్టుల బిడ్‌లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పెట్రోలియం , సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) భారతదేశం అంతటా 65 భౌగోళిక ప్రాంతాల (GA) కోసం CGD ప్రాజెక్ట్‌ల 11వ రౌండ్ బిడ్డింగ్‌కు గతంలో పిలుపునిచ్చిందని తెలిపింది.

దీనిలో భాగంగా.. నిర్వహించిన 11వ రౌండ్ బిడ్డింగ్‌లో అత్యధిక సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్‌లను మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) దక్కించుకుంది. పీఎన్‌జీఆర్‌బీ 19 రాష్ట్రాల్లోని 215 జిల్లాల్లో విస్తరించిన 65 జియోగ్రాఫికల్ ఏరియాలకు బిడ్స్ నిర్వహించింది. 61 ఏరియాలకు బిడ్స్ దాఖలు అయ్యాయి.

ఇందులో మేఘా గ్యాస్ 15, అదానీ టోటల్ గ్యాస్ 14, ఐఓసీఎల్ 9, బీపీసీఎల్ 6 పొందగా మిగిలిన వాటిని ఇతర సంస్థలు చేజిక్కించుకున్నాయి. మొత్తం జియోగ్రాఫికల్ ఏరియాల్లో 24.6 శాతం వాటాతో ఎంఈఐఎల్ అగ్రభాగాన నిలిచింది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో..
61 జియోగ్రాఫికల్ ఏరియాలకు సుమారు రూ.80,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని పీఎన్‌జీఆర్‌బీ భావిస్తోంది. ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్‌లను కంపెనీ ప్రాజెక్టులను అమలు చేస్తుంది. అంతక ముందు ఇదే కంపెనీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిడ్డింగ్ 5, 10 రౌండ్లో పాల్గొంది. ఆ రౌండ్‌లో MEIL 07 భౌగోళిక ప్రాంతాలను గెలుచుకుంది. తెలంగాణలో జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జియోగ్రాఫికల్ ఏరియాలు ఉన్నాయి. ఇప్పటికే నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పైప్‌లైన్ నిర్మాణంతోపాటు 32 సీఎన్‌జీ స్టేషన్లను మేఘా గ్యాస్ ఏర్పాటు చేస్తోంది. ఏపీ విషయానికి వస్తే..కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేస్తోంది. కర్ణాటకలో తూముకూరు, బెల్గావిలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌ను(సీఎన్జీ) మేఘా అందిస్తోంది.































