Minister RK Roja : సినిమాల్లో హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని అగ్ర హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో కొన్నేళ్లు టాప్ లో ఉన్న రోజా అన్ని భాషల్లోను హీరోయిన్ గా నటించింది. ఇక పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రోజా అటు బుల్లితెర మీద అదరగొట్టింది. మోడరన్ మహలక్ష్మి తో మొదలు పెట్టి జబర్దస్త్ తో మరోసారి మంచో ఫామ్ లోకి వచ్చింది. అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇటు జబర్దస్త్ షో చేస్తూ ఉండే రోజా పాలిటిక్స్ లో మొదట టీడీపీ తో మొదలు పెట్టి ఆ తరువాత వైసీపీ లోకి వెళ్లి ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే గా ఉంటూ అలానే మంత్రిగా జగన్ కేబినెట్ లో కొనసాగుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఒక ఊరినే దత్తత తీసుకున్నారు, అలానే ఆర్థికంగా ఇబ్బందులుండి తల్లి దండ్రులు లేక చదువుకోలేని వాళ్లకు చదువు అందిస్తూ ప్రజా సేవ చేస్తున్నారు రోజా.

నా అన్నల పై ట్రోల్స్ భరించలేక పోయాను…
సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా విమర్శలు కామన్. రాజకీయాల్లో అయితే ఒకప్పుడు విమర్శించినా అది హుందగా ఉండేది అయితే ఇప్పటి రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల్లోని నాయకులు వ్యక్తిగత దూషణలతో రెచ్చిపోతున్నారు. ఇక ఈ విమర్శల్తో పాటు ప్రస్తుతం అన్ని పొలిటికల్ పార్టీలు సోషల్ మీడియాను ఒక అస్త్రంగా వాడుకుంటున్నాయి. తమ ప్రత్యర్థులను ట్రోల్స్ చేస్తూ జనంలో పెడుతున్నారు. ఇలానే మంత్రి రోజా కూడా అనేక ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అయితే వాటిని ఎపుడూ పట్టించుకోని రోజా ఇటీవల కాలంలో తన సోదరులను ట్రోల్స్ చేయడాన్ని మాత్రం తట్టుకోలేక పోయానంటూ చెప్పారు. అమ్మ నాన్న లేని నన్ను ఆ లోటు లేకుండా నా అన్నలు పెంచారంటూ చెప్పిన రోజా తన రెండో అన్న చదువుకుంటున్న సమయం నుండి సినిమాలప్పుడు నా రాజకీయ జీవితంలో ప్రతి విషయంలో నాతో ఉంటూ నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. నా ప్రతి కష్టంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి నాకు మంత్రి పదవి వచ్చినపుడు ఆనందంతో హాగ్ చెసుకుని ముద్దు పెట్టుకుంటే దాన్ని ట్రోల్స్ చేసారంటే అలాంటి వాళ్ళను ఏమనాలి అంటూ ఎమోషనల్ అయ్యారు.

ఎపుడూ రాజకీయాలు నీకు వద్దు అని చెప్పని భర్త పిల్లలు ఒకసారి మాత్రం నీకు రాజకీయాలు వద్దు అని ఏడ్చేసారంటూ చెప్పారు రోజా. హైదరాబాద్ లో అసెంబ్లీ సమావేశాలపుడు బయటకు నెట్టి నేను అపస్మరక స్థితిలో ఉంటే ఒక కారులో ఉంచేసారు హాస్పిటల్ కి కూడా పంపలేదు. అపుడు జగన్ గారు చొరవ చూపి నన్ను హాస్పిటల్ పంపించారు. ఆ రోజున మా ఇంట్లో అందరూ భయపడ్డారు, భర్త పిల్లలు ఏడ్చారు నీకు ఈ రాజకీయాలు వద్దు అంటూ బాధపడ్డారు అని రోజా గారు తన రాజకీయ ప్రస్థానంలోని ఆటుపోట్ల గురించి తెలిపారు.





























