Mirchi Madhavi : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ గుర్తింపు తో దూసుకుపోతున్న నటి ఊట్ల మాధవి. కానీ మిర్చి మాధవి గా సినిమాల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. మొదట రేడియో జాకీ గా తన కెరీర్ మొదలు పెట్టిన మాధవి ఆ తరువాత ఆర్టిస్ట్ గా సినిమాల్లో ప్రయాణాన్ని మొదలు పెట్టారు. చాలా సినిమాల్లో అత్త, వదిన, తల్లి పాత్రలతో మెప్పించిన మాధవి ఎన్టీఆర్ కథనాయకుడు, రామ చక్కని సీత, జోడి, శతమానం భవతి వంటి సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఆ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన నరేష్ పవిత్ర లోకేష్ ల గురించి మాధవి స్పందించారు.

ఇద్దరితో కలిసి పనిచేసాను ఎలా ఉంటారంటే…
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాధవి అటు నరేష్ తోనూ ఇటు పవిత్ర లోకేష్ తోనూ పని చేసింది. వారి బంధం గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వారి గురించి మాధవి స్పందించారు. వాళ్ళ మధ్య ఉన్న బంధం ఏదో మనకు తెలియదు పైగా అవసరం కూడా లేదు. అది వారి వ్యక్తిగత విషయం. ఇలాంటివి బయట ఎన్నో జరుగుతుంటాయి. అలా అని వాళ్లందరికీ విషయాలు వెళ్లి మనం అడుగుతున్నామా అలా అడిగితే మీకెందుకు మా విషయాలు అని సమాధానం వస్తుంది. అలానే వీరి విషయం కూడా మీడియా వదిలేస్తే బాగుండేది వారి వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళ పరిస్థితులు ఏమిటో మనకు తెలియవు కదా.

ఒకరి మీద రాయి వేస్తే మన మీదకే బురద జల్లుతుంది. ఒకరిని కామెంట్స్ చేసే ముందు అసలు మనమెంత నిజాయితీగా ఉన్నామో చూసుకోవాలి కదా. ఒకవేళ మనం నిజాయితీగా ఉన్నా కూడా ఇంకొకరి జీవితం గురించి మాట్లాడే హక్కు లేదు. నువ్వు చక్కగా ఉన్నావంటే నీకు మంచి కుటుంబం మంచి పరిస్థితులు ఉండిఉండవచ్చు, అలా అందరికీ ఉండవు కదా, అలా ఎందుకు ఆలోచించారు. అలా ఇంకొకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం పద్ధతి కాదు అంటూ చెప్పారు. ఇక షూటింగ్ లో నెలలు కలిసి పనిచేసిన స్నేహితులు అవ్వాలని లేదు కదా, షాట్ అయ్యాక ఎవరి ఫోన్లు చూసుకుంటూ వారి పనుల్లో ఉంటారు. షూటింగ్ వెళ్ళాక పలకరించుకోవడం వరకే మా బంధాలు అంటూ వివరించారు మాధవి.































