MLA Mekapati Chandhrashekhar Reddy : 10 కోట్లు తీసుకుని బెంగళూరులో షాపింగ్ కాంప్లెక్స్… స్పందించిన మేకపాటి…!

0
123

MLA Mekapati Chandhrashekhar Reddy : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని తాజాగా జరిగిన ఎమ్మెల్సి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డాడు అనే ఆరోపణల మీద వైసీపీ పార్టీ పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇక ఈ విషయాల గురించి అలాగే ఆయన టీడీపీ నుండి పదికోట్ల డబ్బు తీసుకుని మరీ క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డాడు అనే ఆరోపణల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు.

పది కోట్లకు బెంగళూరులో షాపింగ్ కాంప్లెక్స్…

మేకపాటి గారి రెండో ఫ్యామిలీ సంగతి బయటికి రావడం, అటు గౌతమ్ రెడ్డి గారి మరణం తరువాత నెల్లూరు రాజకీయాలు మారిపోయాయి. వచ్చే ఎన్నికలలో మేకపాటికి వ్యతిరేకత ఉందని గెలిచే అవకాశం లేదని జగన్ గారి వద్ద రిపోర్ట్స్ ఉండటంతో ఆయనకు టికెట్ ఇవ్వనని, ఎమ్మెల్సి ఇస్తానని, టికెట్ వేరేవాళ్లకు ఇస్తున్నట్లు మేకపాటిని పిలిచి జగన్ చెప్పారట. మరోసారి అవకాశం ఇవ్వాల్సిందిగా మేకపాటి అడిగినా అది జరగలేదు.

ఈ సారి ఉదయగిరి టికెట్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డికి ఇస్తున్నట్లు చెప్పి అతనకి సహకరించాలని అదేశించడంతో మేకపాటి అసంతృప్తితో ఉండగా టీడీపీ నుండి కడప జిల్లా నేత బిటెక్ రవి ద్వారా పది కోట్లు ఆయనకు ఇచ్చి ఎమ్మెల్సి ఎన్నికలలో టీడీపీ అభ్యర్తికి ఓటు వేసే విధంగా చేసారని ఆరోపణల నడుమ ఆ పది కోట్లకు బెంగళూరులో షాపింగ్ కాంప్లెక్స్ కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మాట్లాడుతూ మేకపాటి అలాంటిదేమి లేదని తాను టీడీపీతో పది కోట్లు తీసుకున్నది నిరూపించండి అంటూ ఛాలెంజ్ చేసారు.