Roja-Nani: టాలీవుడ్.. ఏపీ ప్రభుత్వాల మధ్య టికెట్ల విషయంలో వివాదం రగులుతోంది. థియేటర్ల సినిమా టికెట్ రేట్లను తగ్గించడంతో టాలీవుడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు చేసే వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేస్తున్నాయి. దీనికి ఏపీ మంత్రులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు.

ఇటీవల హీరో నాని థియేటర్ల కలెక్షన్ల కన్నా.. కిరాణా కొట్టు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ నేరుగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై జగన్ సర్కార్ కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ముఖ్యంగా మంత్రి పేర్నినాని తనదైన శైలిలో స్పందించారు.

ఆయన ఏ థియేటర్ కలెక్షన్లు చూశాడో.. ఏ కిరాణా కొట్టు కలెక్షన్లు చూశాడో తెలియదని.. బహుషా రెండింటి కలెక్షన్లను లెక్కించి హీరో నాని ఈ కామెంట్లు చేసి ఉంటాడేమో అని మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చాడు. దీంతో పాటు హీరో సిద్దార్థ్ కు కూడా చురకలు అందించారు.
తాజాగా ఈవిషయంపై ఎమ్మెల్యే రోజా కూడా స్పందించింది. టికెట్ ధరలపై ప్రభుత్వం నియమించిన కమిటీ అన్ని విషయాలను పరిష్కరిస్తుందని.. ఆమె అన్నారు. హీరో నాని సినిమా టికెట్ల కన్నా కిరాణా కొట్టు కలెక్షన్లే బాగా అనిపిస్తే ఆయన సినిమాలు తీయడం వేస్ట్ అని.. కిరాణా కొట్టు బిజినెస్ పెట్టుకోవాలని సెటైర్ వేశారు.
రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తున్నారు.. ఎమ్మెల్యే రోజా..
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టడమే అవుతుందని రోజా వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశం ఉంటుందని రోజా అంది. సినిమాలు తీస్తూ పొలిటికల్ పార్టీ పెట్టిన వ్యక్తి వల్లే ఇదంతా జరుగుతుందని.. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి తోచినట్లు వారు మాట్లాడటం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. కొంతమంది నోటి దురుసు వల్లే ’మా‘ ఎన్నికలు జనరల్ ఎలెక్షన్లను తలపించాయని రోజా విమర్శించారు.






























