Categories: Political News

“ఎమ్మెల్యేలు గాలి నా కొడుకులు” కూటమి ఎమ్మెల్యేలపై రోజా సంచలన వ్యాఖ్యలు..

నగరి: మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త దుమారం రేపాయి. తాజాగా నగరి నియోజకవర్గంలో జరిగిన ‘రీకాలింగ్ చంద్రబాబు‘ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలను తీవ్రంగా ఎద్దేవా చేశారు. ముఖ్యంగా తొలిసారి ఎమ్మెల్యేలు అయిన నేతలపై ఆమె విమర్శలు సంచలనంగా మారాయి.

“MLAs are my sons” Roja’s sensational comments on coalition MLAs.

‘గాలి నా కొడుకుల్లాంటి ఎమ్మెల్యేలు’, ‘వీకెండ్ నాయకులు’

“ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా గాలి నా కొడుకులు మించి ఎమ్మెల్యేలు బయటకొచ్చారు. కానీ వారిలో ఒక్కరైనా ప్రజల దగ్గరకు వెళ్లి కష్టాలు అడిగారా?” అంటూ రోజా ప్రశ్నించారు.

ఇంతటితో ఆగని రోజా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే, టీడీపీ, జనసేన నేతలు అమెరికాకు పారిపోతారని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ‘వీకెండ్ నాయకులు’ అంటూ దారుణంగా విమర్శించారు. “ప్రజలకు రేషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి డబ్బులే లేవు, కానీ వీళ్లు మాత్రం హెలికాప్టర్లలో, విమానాల్లో తిరుగుతున్నారు” అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు, వైసీపీ కార్యకర్తలకు హెచ్చరిక

వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే వందకు వంద రెట్లు వడ్డీతో ప్రతీకారం తీర్చుకుంటామని ఆమె హెచ్చరించడం విశేషం. అంతేకాదు, పవన్ కళ్యాణ్‌పై కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. “పవన్‌కు పిచ్చి బాగా ముదిరింది. ఎక్కడికి వెళ్తే అక్కడ ‘ఇక్కడే పుట్టాను’ అంటాడు. అసలు ఆయన ఎక్కడ పుట్టాడు, ఏం చదువుకున్నాడో ఆయనకే తెలియదు,” అంటూ ఎద్దేవా చేశారు.

టీడీపీ నుండి ప్రతిస్పందన

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. పార్టీ ఎమ్మెల్యే భానుప్రకాశ్ రెడ్డి రోజా వ్యాఖ్యలను ఖండించారు. “రూ. 2 వేలకైనా ఏ పని చేసిన ఆమె, ఇప్పుడు రూ. 2 వేల కోట్ల ఆస్తితో తన గర్వాన్ని చూపిస్తున్నది. ముఖ్యమంత్రి వయసెంతో, ఆమె వయసెంతో గుర్తుంచుకోకుండా మాట్లాడుతోంది,” అంటూ రోజాపై విమర్శలు గుప్పించారు.

రాజకీయ వేడి: అధికార, విపక్షాల మధ్య సమరం

ఇక రోజా వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో గమనార్హంగా చర్చలు జరుగుతున్నాయి. ఆమె మాటలు అధికార, విపక్ష పార్టీల మధ్య వాడివేడిగా మారిన రాజకీయ సమరానికి నిదర్శనమవుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 weeks ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago