నగరి: మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త దుమారం రేపాయి. తాజాగా నగరి నియోజకవర్గంలో జరిగిన ‘రీకాలింగ్ చంద్రబాబు‘ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలను తీవ్రంగా ఎద్దేవా చేశారు. ముఖ్యంగా తొలిసారి ఎమ్మెల్యేలు అయిన నేతలపై ఆమె విమర్శలు సంచలనంగా మారాయి.

‘గాలి నా కొడుకుల్లాంటి ఎమ్మెల్యేలు’, ‘వీకెండ్ నాయకులు’
“ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా గాలి నా కొడుకులు మించి ఎమ్మెల్యేలు బయటకొచ్చారు. కానీ వారిలో ఒక్కరైనా ప్రజల దగ్గరకు వెళ్లి కష్టాలు అడిగారా?” అంటూ రోజా ప్రశ్నించారు.
ఇంతటితో ఆగని రోజా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే, టీడీపీ, జనసేన నేతలు అమెరికాకు పారిపోతారని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ‘వీకెండ్ నాయకులు’ అంటూ దారుణంగా విమర్శించారు. “ప్రజలకు రేషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి డబ్బులే లేవు, కానీ వీళ్లు మాత్రం హెలికాప్టర్లలో, విమానాల్లో తిరుగుతున్నారు” అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు, వైసీపీ కార్యకర్తలకు హెచ్చరిక
వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే వందకు వంద రెట్లు వడ్డీతో ప్రతీకారం తీర్చుకుంటామని ఆమె హెచ్చరించడం విశేషం. అంతేకాదు, పవన్ కళ్యాణ్‌పై కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. “పవన్‌కు పిచ్చి బాగా ముదిరింది. ఎక్కడికి వెళ్తే అక్కడ ‘ఇక్కడే పుట్టాను’ అంటాడు. అసలు ఆయన ఎక్కడ పుట్టాడు, ఏం చదువుకున్నాడో ఆయనకే తెలియదు,” అంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ నుండి ప్రతిస్పందన
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. పార్టీ ఎమ్మెల్యే భానుప్రకాశ్ రెడ్డి రోజా వ్యాఖ్యలను ఖండించారు. “రూ. 2 వేలకైనా ఏ పని చేసిన ఆమె, ఇప్పుడు రూ. 2 వేల కోట్ల ఆస్తితో తన గర్వాన్ని చూపిస్తున్నది. ముఖ్యమంత్రి వయసెంతో, ఆమె వయసెంతో గుర్తుంచుకోకుండా మాట్లాడుతోంది,” అంటూ రోజాపై విమర్శలు గుప్పించారు.
రాజకీయ వేడి: అధికార, విపక్షాల మధ్య సమరం
ఇక రోజా వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో గమనార్హంగా చర్చలు జరుగుతున్నాయి. ఆమె మాటలు అధికార, విపక్ష పార్టీల మధ్య వాడివేడిగా మారిన రాజకీయ సమరానికి నిదర్శనమవుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి రోజా pic.twitter.com/gSbBlvExun
— ChotaNews App (@ChotaNewsApp) July 22, 2025





























