జబల్‌పూర్‌లోని బర్గి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సజయ్ యాదవ్ కుమారుడు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హతితాల్ ప్రాంతంలోని ఎమ్మెల్యే నివాసంలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యాదవ్ చిన్న కుమారుడు విభు యాదవ్(17) తన బెడ్రూంలో తన తలపై గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల శబ్దం విన్న కుటుంబ సభ్యులు అతని గదికి పరిగెత్తుకుని వెళ్లారు. వెళ్లే సరికి అతడు కిందపడి కనిపించాడు. అప్రమత్తమైన ఆ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు అతడిని పరిశీలించి అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP), రోహిత్ కష్వానీ మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించామన్నారు. అయితే అతడు ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించిన ఆయుధం ఇంకా దొరకలేని అదనపు సూపరింటెండెంట్ రోహిత్ కేశ్వాని తెలిపారు.
ఈ ఘటన ప్రతీ ఒక్కరికీ తెలవడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రి వెలుపల గుమిగూడారు. పోలీసులు వాళ్లను కంట్రోల్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ కష్వానీ తెలిపాడు.



























