Crime news: మామతో అక్రమ సంబంధం.. బండారం బయటపడుతుందని కన్న కూతురినీ హత్యచేసిన కసాయి తల్లి...!
Crime news: కన్న కూతురనే కనికరం లేదు.. మనవరాలు అనే మమకారం లేదు. తన అనైతిక సంబంధాన్ని ఎక్కక బయటపెడుతుందో అని ఓ తల్లి కర్కషంగా ప్రవర్తించింది. భర్త తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుని బరితెగించింది. సొంత కూతురునే దారుణంగా చంపేసింది.
ఈ ఘటన ఖమ్మం జిల్ల బోనకల్ లో జరిగింది. ఓ మహిళ తన భర్త తండ్రితోనే అక్రమ సంబంధం నెరుపుతూ.. ఎక్కడ తమ బండారాన్ని భర్తకు చెబుతుందో అని భయపడి కన్న కూతురును కడతేర్చింది. చివరకు పోలీస్ విచారణలో నేరాన్ని అంగీకరించింది. వైరా ఏసీపీ స్నేహ మెహ్రా ఈ దారుణానికి సంబంధించి వివరాలను వెల్లడించారు.
బోనకల్ కు చెందని పాలెపు హరికృష్ణ– సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. హరికృష్ణ లారీ, ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తరుచూ పని నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్తుంటాడు. దీంతో ఇంటి వద్ద తక్కువగానే ఉండే వాడు. ఈక్రమంలో సునీత భర్త తండ్రి నర్సింహరావుతో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. ఐదారేళ్లుగా ఇది కొనసాగుతున్నా.. ఇటీవల తల్లి-తాత ఒకే గదిలో ఉండటాన్ని గమనించింది పెద్ద కూతురు మహాదేవి(11). ఈ విషయాన్ని తండ్రికి చెబుతా అని బెదిరించింది. దీంతో సునీత, నర్సింహారావులు ఆ మెను హతమార్చాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెల 8న మహాదేవి కాళ్లు, చేతులను చున్నీతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వైరుతో మెడకు బిగించి సునీత, నర్సింహారావులు హతమర్చారు. పాప స్కూల్ లో పిట్స్ వచ్చి చనిపోయిందని స్కెచ్ వేశారు. అయితే పాపమెడపై ఉన్న కమిలిన గాయాలను బంధువులు గమనించి పోలీసులకు చెప్పడంతో వారు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు. మహాదేవి హత్యకు గురైనట్లు నివేదిక రావడంతో పోలీసులు బాలిక తల్లి, తాతను అదుపులోకి తీసుకుని విచారించారు. మహాదేవిని తామే హత్య చేసినట్లు సునీత, నర్సింహారావు అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…