ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య రోజురోజుకు మానవ సంబంధాలు పూర్తిగా అంతరించిపోతున్నాయి. కేవలం వారి స్వార్థం సుఖం కోసం కడుపున పుట్టిన బిడ్డ అనే ప్రేమానురాగాలు, కడుపు తీపిలేకుండా కన్న బిడ్డలపై తల్లిదండ్రులు ఎంతో పైశాచికత్వం చూపిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఎంతో మంది తల్లిదండ్రులు వివాహేతర సంబంధాలు పెట్టుకొని వారి సంబంధానికి అడ్డుగా ఉన్న వారినీ దారుణంగా చంపుతున్న ఘటనల గురించి మనం ఎన్నో విన్నాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి కర్ణాటకలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నెడువరంపాక్కంకి చెందిన సెల్వం, దుర్గ అనే దంపతులకు సూర్య, శృతి, సంతోష్ అనే ముగ్గురు సంతానం కలరు. ఎంతో ఆనందంగా సంతోషంగా సాగిపోతున్న జీవితంలో గోపాలకృష్ణన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.ఈ క్రమంలోనే దుర్గ ఆ వ్యక్తితో పరిచయం ఏర్పర్చుకొని తనతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఈ క్రమంలోనే దుర్గ గోపాలకృష్ణన్ తో ఏకాంతంగా గడుపుతున్న సమయన్ని తన పెద్ద కుమారుడు సూర్య చూశాడు. తన కొడుకుకి తన వివాహేతర సంబంధం గురించి తెలియడంతో తన బాగోతం బయటపెడతాడన్న ఉద్దేశంతో తన ప్రియుడు గోపాలకృష్ణన్ తో కలసి తన కొడుకును హత్య చేయడానికి పథకం వేసింది. ఈ క్రమంలోనే గోపాలకృష్ణన్, అన్నామలై అనే వ్యక్తి సహాయంతో సూర్యను తీసుకెళ్లి హత్య చేశారు.
సూర్య మృతిపట్ల తన తాతయ్యకు అనుమానం రావడంతో ఈ విషయాన్ని చోళవరం పోలీసులు గోపాలకృష్ణన్‌ను ప్రశ్నించారు. ఈక్రమంలో సూర్య తన తల్లి దుర్గతో తను ఏకాంతంగా గడుపుతున్న సమయంలో చూసాడు. ఈ క్రమంలోనే వారి వివాహేతర సంబంధం బయటపడటం అకారణంగా తనని చంపినట్లు పోలీసులకి తెలియడంతో పోలీసులు వీరిపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



























