Mother killed daughter : ప్రియుడి మోజులో పసిబిడ్డను చంపి పూడ్చి పెట్టిన తల్లి… విశాఖలో దారుణం…!

0
139

Mother killed daughter : మొన్నటికి మొన్న రెండో భర్తతో తన కన్నబిడ్డలను అత్యాచారం చేయించిన ఒక తల్లిని చూస్తే నేడు ఏకంగా ప్రియుడి మోజులో పడి పసిబిడ్డను గరిటతో కొట్టి చంపింది ఓ కన్న తల్లి. ఏ బిడ్డ అయినా ఈ ప్రపంచంలో సురక్షితంగా ఉండేది అమ్మ దగ్గరే అలాంటి అమ్మే బిడ్డను కడతేరిస్తే ఇక ఆ బిడ్డకు రక్షణ ఎక్కడ. కన్న తల్లినీ నమ్మే పరిస్థితి లేని లోకంలో నేడు మనం జీవిస్తున్నాం. సమాజంలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు ఆశ్చర్యంతో పాటు భయాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా విశఖలో ఒక తల్లి తన పదిహేను నెలల పసికందును దోశ వేసే గారిటతో కొట్టి చంపేసిన ఘటన సంచలనం రికేత్తించింది.

అల్లరి చస్తోందని చంపేసిన స్వప్న…

విశాఖ గాజువాక కు చెందిన స్వప్న సుందరి అనే యువతికి వివాహం జరిగి పదిహేను నెలల పాప ఉండగా భర్తతో గొడవపడి విశాఖ మంగలపాలెం జీఎంఆర్ కాలనీలో ఓ గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటోంది. ఆమెకు తన బంధువైన రమణ బాబు అనే వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉండగా అతను భర్త అంటూ చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుంది. జులై 17న సోమవారం నాడు పాప గీతాశ్రీ అల్లరి చేస్తుండగా కోపంతో పాపను తల మీద గరిటతో కొట్టింది స్వప్న. దీంతో కాసేపటికే పాప చనిపోయింది.

పాప చనిపోయాక బయపడిన స్వప్న ప్రియుడు రమణ బాబు తో కలిసి అపార్ట్మెంట్ వెనుక మట్టిలో పూడ్చేసింది. కుక్కలు మట్టిని తోడి పాప శవాన్ని పీక్కుతినడంతో స్థానికులకు దుర్గంధం వచ్చి చూడగా పాప శవం కనిపించింది. దీంతో పోలీసులకు ఫోన్ చేయగా పాప తల్లి చంపినట్లుగా తేలింది. పాపను కొన్నిసార్లు చూసినా పాప లేదని తెలిసి పక్కింటివాళ్ళు సైతం కన్నీరు పెట్టుకుంటుడాగా స్వప్న మీద ఆమె తల్లి కేసు పెట్టడం విశేషం. తొమ్మిది నెలలు మోసి కన్న పాపను తన చేతులతో ఎలా చంపిదో అని అక్కడి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.