Mr. Tea Naveen Reddy Vaishali Issue : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి. ప్రేమించి పెళ్లిచేసుకోవాలని అనుకుంటే వాలింట్లో వాళ్ళు వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారని వందమందిని తీసుకెళ్లి వైశాలి ఇంటిపై దాడి చేసి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లాడు నవీన్ రెడ్డి. ఈ ఇష్యూలో వైశాలి తప్పు ఉంది అంటూ కొందరు వాదిస్తుంటే మరికొందరు నవీన్ ఒక ఆడపిల్ల విషయంలో అలా చేయకుండా ఉండవలసింది అంటూ మాట్లాడుతున్నారు. వారిద్దరికీ పరిచయం ఉండటం నవీన్ ఆ అమ్మాయిని ప్రేమించడం అన్నీ వాస్తవమే అయినా ఎక్కడ వైశాలి పాత్ర ఎంత అన్నది తెలియదు.

సెల్ఫీ వీడియోలో తప్పు ఒప్పుకున్న నవీన్ రెడ్డి…
తాజాగా నవీన్ రెడ్డి గోవా లో ఉన్నట్లు సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి నవీన్ రెడ్డి ని అరెస్టు చేసారు. అయితే అంతకంటే ముందే నవీన్ ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో వదిలాడు. అందులో వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ నేనే అంటూ చెప్పి తాను చేసింది తప్పే అని ఒప్పుకుంటూ అసలు అంత దూరం ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో వివరించాడు.

ఇక తనను అందరూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం విమర్శించడం చేస్తున్నారు. అయితే వాళ్ళందరూ ఒకసారి అలోచించాల్సిందిగా కోరాడు. తన ప్లేసులో ఒక అమ్మాయి ఉంటే ఇలాగే మాట్లాడుతారా అంటూ అడిగాడు. ఒక అమ్మాయి అబ్బాయి ఇష్యూ లా కాకుండా ఒక కుటుంబంలో జరిగిన సంఘటనగా దీన్ని చూడాలంటూ కోరాడు. తనకు జరిగిన మోసం వల్లే ఇలా చేసానంటు చెప్పాడు నవీన్ రెడ్డి.































