Mr. Tea Naveen Reddy Vaishali Issue: వైశాలి, నవీన్ రెడ్డి ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతోంది. వందమందిని తీసుకెళ్లి ఇంటిపై గొడవ చేసి వైశాలి ని కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి ఆమెను తీసుకెళ్లిన కొద్ది గంటలకే మళ్ళీ ఆమెను వెనక్కి పంపించాడు. అయితే ఈ ఉదంతంలో తాను చేసింది తప్పే కానీ ఎందుకు చేసానో, నేనెంత మోసపోతే అలా చేస్తాను అంటూ నవీన్ ఒక సెల్ఫీ వీడియోలో చెప్పడం, ఇలా రోజుకో కొత్త మలుపుతో ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాతో ఎక్కడెక్కడ తిరిగిందంటే…
నవీన్ రెడ్డి, వైశాలి ఇద్దరూ షెటల్ ఆడటానికి వెళ్లి అక్కడ పరిచయం ఏర్పడి ఆపై ప్రేమించుకున్నారు అన్నది ఇప్పటివరకు తెలిసిన విషయం. అయితే వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు అన్నది నవీన్ రెడ్డి తన సెల్ఫీ వీడియోలో వివరించడం జరిగింది. వైశాలి బిడిఎస్ చదువుతున్న సమయంలో కాలేజీ అయిపోయిన తరువాత ఇంటికి వెళ్లే బస్ రావడానికి గంట సమయం ఉంటే అపుడు తరచూ నవీన్ ను కలిసేదట. ఇద్దరూ కలిసి శంషాబాద్ రైయిన్ బో హోటల్, అలానే ఏఎమ్బి మాల్ లో తిరిగినట్లు నవీన్ చెబుతున్నాడు. అంతే కాకుండా జనవరి 10 న షామీర్ పేట్ అలాంకృత్ రిసార్ట్స్ లో ఉదయం 8 గంటలకు వెళ్లి సాయంత్రం 4 వరకు అక్కడే పర్సనల్ గా టైం స్పెండ్ చేసాం అంటూ నవీన్ రెడ్డి చెప్పారు. ఇక ఆ తరువాత చివరగా ప్రైవేట్ గా చింతల కుంట స్వాగత్ గ్రాండ్ లో ఇద్దరం టైం స్పెండ్ చేసాం అంటూ నవీన్ చెప్పారు.

ఇక తన షాపింగ్ ఖర్చు ఎపుడూ లెక్కపెట్టలేదని తాను అడిగిన బట్టలు అన్ని కొనిచ్చానని చెప్పాడు నవీన్ రెడ్డి. తన ఫ్రెండ్స్ తో నా హోటల్ లో మూడు రోజులు ఉందని తెలిపాడు. ఇక వాళ్ళ ఫ్యామిలీ ని తీసుకుని గోవా, మురుడేశ్వర్ ట్రిప్ కూడా వెళ్లామని చెప్పారు నవీన్. ఇక తనకు వరంగల్ లో మూడురోజులు సెమినార్ ఉంటే మొదటి రోజు వెళ్లి అక్కడి నుండి హుబ్లీ స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేసుకుంది. అందరూ 22, 23 ఏజ్ వాళ్ళు కావడం ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు వెళ్తున్న ట్రిపు లో ఇద్దరు అబ్బాయిలకు మాత్రమే డ్రైవింగ్ వస్తుంది అందులో అంత దూరం పంపడం సేఫ్ కాదు అనిపించింది అందుకే వద్దని కొంచెం ఆర్గుమెంట్ వచ్చింది అంటూ నవీన్ వివరించారు.



























