Mr. Tea Naveen Reddy Vaishali Issue: వైశాలి, నవీన్ రెడ్డి ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతోంది. వందమందిని తీసుకెళ్లి ఇంటిపై గొడవ చేసి వైశాలి ని కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి ఆమెను తీసుకెళ్లిన కొద్ది గంటలకే మళ్ళీ ఆమెను వెనక్కి పంపించాడు. అయితే తాజాగా ఈ కిడ్నాప్ కేసులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్‌రెడ్డి సోదరుడు నందీప్‌రెడ్డి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

సోషల్ మీడియాలో నవీన్‌రెడ్డి, వైశాలి వీడియోలను సర్క్యులేట్ చేశారని, అంతేకాకుండా గోవాలో నవీన్‌రెడ్డి సేల్ఫీ వీడియోలను రికార్డు చేసి మీడియాకు అందించారనే కారణంతో పోలీసులు నవీన్ రెడ్డి సోదరుడు నందీప్‌రెడ్డి తో సహా వంశీభరత్‌రెడ్డి అనే మరోవ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వైశాలి వీడియోలు మీడియాలో ప్రసారం చేయొద్దని సూచించారు పోలీసులు. అలా ప్రసారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మంగళవారం గోవాలో నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఆపై నవీన్‌రెడ్డి సహచరులను కూడా హైదరాబాద్ శివార్లలో అదుపులోకి తీసుకున్నారు. వీరికి వైద్యపరీక్షలు నిర్వహించిన తరువాత ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నవీన్ రెడ్డితో పాటు మరో ఐదుగురు నిందితులకు 14రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపధ్యంలో నవీన్‌రెడ్డితో పాటూ అతని సహచరులను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.































