Mrunal thakur opens about jersy failure : దక్షిణాది సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేయడం హిట్ కొట్టడం సాధారణమే. చాలా బాలీవుడ్ సినిమాలు ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాల రీమేకులే. అయితే ఇటీవల రీమేక్ అయిన తెలుగు సినిమా బాగున్నా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేదు. దీనికి కారణం మరో సౌత్ సినిమా కావడం విశేషం. జెర్సీ సినిమా తెలుగులో నాని నటించిన జెర్సీ సినిమాకు రీమేక్. ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సాధించి నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి.

బాలీవుడ్ లో సినిమా పోవడానికి కారణాలు చెప్పిన మృనాల్ ఠాకూర్….
ఇక హిందీ జెర్సీ సినిమాను కూడా తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే హిందీ జెర్సీ సినిమాకు దర్శకత్వం వహించారు . సినిమా చాలా చక్కగా వచ్చింది. సినిమాలో షాహిద్ నటన కూడా అందరిని ఆకట్టుకుంది. ఇక దర్శకుడికి స్టాండింగ్ ఓవేషన్ వంటి అరుదైన గౌరవం కూడా దక్కింది. అంతా బాగానే ఉన్నా సినిమా విజయం సాధించలేదు.
ఈ సినిమా పరాజయానికి కేజీఎఫ్ 2 సినిమా కారణం . కేజీఎఫ్ 2 సినిమా బాలీవుడ్ లో ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలుసు. ఇక ఈ సినిమా సునామిలో చాలా బాలీవుడ్ సినిమాలు కొట్టుకుపోయాయి. ఇక జెర్సీ సినిమాను కూడా కేజీఎఫ్ 2 వసూళ్లు చూసి వారం వాయిదా వేసి మరి విడుదల చేసినా సినిమాకు మంచి పేరు వచ్చినా కలెక్షన్స్ మాత్రం రాలేదు. 80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.20 కోట్లు కూడా దాటలేకపోయింది.
సినిమా ఫ్లాప్ అయిన కొన్ని రోజుల తర్వాత, జెర్సీ పరాజయం గురించి మృణాల్ ఠాకూర్ మాట్లాడారు. సినిమా వైఫల్యానికి చాలా కారణాలు ఉన్నాయి. కారణం ఏదైనా నేను చాలా నిరుత్సాహపడ్డాను బహుశా ఒక మంచి సినిమా అవ్వడంవల్ల ఇలా డీలా పడ్డాను అంటూ మృనాల్ వివరించారు. ఇక తెలుగు జెర్సీ సినిమా హిందీ డబ్బింగ్ టీవీలలో రావడం యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉండటం కారణాలుగా ఆమె వివరించారు. ఇంకా ఇతర కారణాలు కూడా సినిమా వైఫల్యానికి కారణాలు అంటూ ఓపెన్ అయ్యారు మృనాల్ ఠాకూర్.































