MS Dhoni: సినిమా ఇండస్ట్రీకి క్రికెట్ రంగానికి ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ నిర్మాతగా మారి సొంత బ్యానర్ లో ఓ తమిళ సినిమాని చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని షూటింగ్ పనులను ప్రారంభించింది.

ధోనీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మించిన నిర్మాణ సంస్థలో
లెట్స్ గెట్ మ్యారీడ్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా, ప్రముఖ నటి నదియా, హరీష్ కళ్యాణ్ అలాగే ప్రముఖ కమెడియన్ యోగి బాబు కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే కమెడియన్ ధోనీకి వీరాభిమాని.
క్రికెట్ అంటే కూడా ఈయనకు విపరీతమైన ప్రత్యేకతకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు. షూటింగ్ లొకేషన్లో కూడా షూటింగ్లో ఏమాత్రం గ్యాప్ దొరికిన బ్యాట్ చేతపట్టి క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంటారు. ఇలా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి యోగి బాబుకు ధోని స్పెషల్ గిఫ్ట్ పంపించి సర్ప్రైజ్ చేశారు.

MS Dhoni: బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చిన ధోని…
ధోని స్వయంగా సంతకం చేసినటువంటి ఒక బ్యాట్ యోగి బాబుకు కానుకగా పంపించారు. ధోని యోగి బాబు కోసం సంతకం చేసినటువంటి బ్యాట్ పంపించడంతో యోగి బాబు సంతోషంలో మునిగి తేలుతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























